అనారోగ్యంతో బాధపడుతున్న 'జబర్దస్త్' పంచ్ ప్రసాద్
ప్రముఖ టీవీలో ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్‌లో తన టైమింగ్‌తో పంచ్‌ల వర్షం కురిపిస్తూ వచ్చిన పంచ్ ప్రసాద్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ కారణంగా ఆయన ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నట్టు సమాచారం.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తన రెండు కిడ్నీలు చెడిపోయినట్టు వైద్యులు చెప్పారని తెలిపారు. అప్పటి నుంచి డయాలసిస్ చేయిస్తున్నప్పటికీ ఆరోగ్యం మాత్రం మెరుగపడలేదు కదా మరింత ఇబ్బందికరంగా మారింది.
ఫలితంగా ఆయన నడవలేని స్థితికి జారుకున్నారు. ఆయన పరిస్థితి బాగోలేదని జబర్దస్త్ నటుడు నూకరాజు తెలిపారు. ఆయనకి అందరూ మద్దతు ఇచ్చి అండగా నిలబడాలని కోరారు.
కాగా, పంచ్ ప్రసాద్ గత కొంతకాలంగా జబర్దస్త్ కార్యక్రమంలో కనిపించడం లేదు. దీంతో ఆయనకు ఏమైందంటూ ఆరా తీయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పంచ్ ప్రసాద్‌కు అనారోగ్యం బాగోలేదన్నట్టు నూకరాజు వెల్లడించారు.