శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్

తుపాకీ మిస్ ఫైర్... కానిస్టేబుల్ గొంతులోకి దూసుకెళ్లిన బుల్లెట్

gunshoot
హైదరాబాద్ నగరంలోని అసిఫాబాద్ జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఒక విషాదకర ఘటన జరిగింది. కానిస్టేబుల్‌ చేతిలోని గన్ ఒకటి మిస్ ఫైర్ అయింది. దీంతో బుల్లెట్ కానిస్టేబుల్ గొంతులోకి దూసుకెళ్లింది. దీంతో కానిస్టేబుల్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. 
 
అయితే, గన్ మిస్ ఫైర్ ఎలా జరిగిందన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడా లేదా ప్రమాదవశాత్తు గన్ మిస్ ఫైర్ అయిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషంపై విచారణ కొనసాగిస్తున్నారు. 
 
సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ కాగజ్ నగర్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్‌ను పరామర్శించి, అతని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ ఘట ఎలా జరిగిందనే విషయంపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. మెరుగైన చికిత్స కోసం కానిస్టేబుల్‌ను హైదరాబాద్ నగరానికి తరలించారు.