1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 నవంబరు 2022 (14:42 IST)

తెలంగాణాలో విద్యార్థులకు టీడీ వ్యాక్సినేషన్

Injection
ధనుర్వాతం, కంఠసర్పి వ్యాధుల నుంచి చిన్నారుల నుంచి విద్యార్థులకు రక్షణ కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం నుంచి టీడీ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 7వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్నికొనసాగిస్తుంది. 
 
జిల్లా వ్యాప్తంగా 5వ తరగతి, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు టీడీ వ్యాక్సిన్ ఇస్తారు. జిల్లాలో 23 పీహెచ్‌సీలో, 2 యూఎచ్‌సీలు ఉన్నాయి. ఈ కేంద్రాల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, గురుకుల పాఠశాలలు 1075 ఉండగా, ఆ పాఠశాలల్లో 5, 10 తరగతలు చదువుతున్న విద్యార్థులు 31,854 మంది ఉన్నారు. 
 
వీరిలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు 15,696 మంది ఉన్నారు. వీరికే కాకుండా ఇతర బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ వ్యాక్సిన్ వేయనున్నారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వైద్యాధికారులు, ఆర్బీఎకే, ఆయుష్ వైద్యులు, సూపర్ వైజర్లు, ఏఎన్ఎస్‌లు, ఆశా వర్కర్లు, భాగస్వాములు కానున్నారు.