శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 నవంబరు 2021 (07:33 IST)

కుమార్తెను భయపెట్టి యేడాదిగా తండ్రి అత్యాచారం... ఎక్కడ?

కన్న కుమార్తెను భయపెట్టిన ఓ కామాంధ తండ్రి ఒక యేడాది కాలంగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఇపుడు ఆ బాలిక మూడు నెలల గర్భవతి. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ జిల్లాకు చెందిన ఓ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. నాలుగేళ్ళ క్రితం బతకుదెవురు కోసం హైదరాబాద్ పటాన్ చెరువుకు వచ్చారు. భార్య ఓ వెంచర్‌‌లో పని చేస్తుంటే భర్త ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నారు. 
 
అయితే, 15 యేళ్ళ పెద్ద కుమార్తె ఇంటిపట్టునే ఉంటుంది. ఈమెపై భయపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. అలా ప్రతి రోజూ మధ్యాహ్నం ఇంటికి వచ్చి కుమార్తెతో కామవాంఛ తీర్చుకునేవాడు. ఈ క్రమంలో ఇటీవల తన ముగ్గురు పిల్లలతో కలిసి సొంతూరుకు వచ్చింది. అపుడు పెద్ద కుమార్తె అస్వస్థతకు లోనుకావడంతో సమీపంలోని వైద్యులకు చూపించగా, వారు షాక్‌కు గురిచేసే వార్తను చెప్పారు.
 
దీంతో కుమార్తెను నిలదీయగా అసలు విషయం చెప్పడంతో ఆ తల్లి నిర్ఘాంతపోయింది. ఆ తర్వాత భర్తను నిలదీయగా ఈ విషయం బయటకు చెపితే నలుగుర్నీ చంపేస్తానని బెదిరించి, గర్భందాల్చిన కుమార్తెను తీసుకెళ్లి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేయించాడు. ఇది తెలుసుకున్న భార్య.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.