సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 నవంబరు 2021 (17:43 IST)

భర్తకు పూటుగా మద్యం తాగించి ఆపై అతడి భార్యపై అత్యాచారం - హత్య

హైదరాబాద్ నగరంలోని మరో దారుణం వెలుగు చూసింది. హయత్ నగర్‌లో ఓ వ్యక్తికి కొందరు మద్యం తాగించి అతని భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తారామతి పేట్‌కు చెందిన ఓ వ్యక్తికి మంగళవారం ఇద్దరు వ్యక్తులు పీకల వరకు మద్యం తాగించారు. అతిగా మద్యం సేవించడంతో అతను స్పృహ కోల్పోయాడు. 
 
ఆ తర్వాత అతన్ని ఇంటికి తీసుకొచ్చారు. పిమ్మట అతని భార్యపై ఈ ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత హత్య చేశారు. మరుసటి రోజు ఉదయం జరిగిన ఘోరం తెలుసుకున్న భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
కేసు నమోదు చేసిన పోలీసులు... సురేశ్, శ్రీకాంత్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్టు తేలింది. దీంతో సురేశ్‌ను పోలీసులు అరెస్టు చేయగా, పరారీలో ఉన్న శ్రీకాంత్ కోసం గాలిస్తున్నారు.