తెలంగాణలో తొడగొట్టిన కాంగ్రెస్ - ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి?
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తొడగొట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పోటీ చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా, ఖమ్మంలో నాగేశ్వర రావు, మెదక్‌లో నిర్మలా జగ్గారెడ్డి, నిజామాబాద్‌లో మహేష్ కుమార్ గౌడ్, వరంగల్‌లో వేం వాసుదేవరెడ్డిలను బరిలోకి దించాలని భావిస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
అయితే, అభ్యర్థుల పేర్లను టీపీసీసీ అధికారికంగా ప్రకటించనుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ల గడువు బుధవారంతో ముగియనున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీకి చెందిన ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారు. అలాగే, జిల్లా డీసీసీలకే పూర్తి నిర్ణయం కట్టబెట్టాలని భావిస్తోంది.