శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 నవంబరు 2021 (15:09 IST)

వైరా గురుకులంలో కరోనా కలకలం : 27 మంది విద్యార్థులకు పాజిటివ్

తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని వైరాలో ఉన్న గురుకుల పాఠశాలలో కరోనా వైరస్ కలకలం చెలరేగింది. ఏకంగా 27 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. ఇటీవల ఇంటికి వెళ్లివచ్చిన ఓ విద్యార్థి ఉన్నట్టుండి అస్వస్థతకు లోనయ్యాడు. దీంతో అతనికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, పాజిటివ్ అని తేలింది. 
 
ఆ విద్యార్థి ద్వారా మిగిలిన విద్యార్థులకు ఈ వైరస్ సోకింది. దీంతో కరోనా వైరస్ బారినపడిన విద్యార్థులందరినీ వారివారి ఇళ్లకు పంపించేశారు. అలాగే, ఈ విషయం తెలిసిని మిగిలిన విద్యార్థులకు కూడా తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళుతున్నారు. 
 
ఇదిలావుంటే, ఇటీవల నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని చెన్నారం గేట్ వద్ద ఉన్న గురుకుల బాలికల పాఠశాలలో పది మంది విద్యార్థులకు కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే. వీరిలో ఇద్దరు టీచర్లు కూడా ఉన్నారు.