దేశంలో కొత్తగా మరో 11 వేల కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో కొత్తగా మరో 11446 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్యపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
అలాగే, దేశంలో 3,37,87,047 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,39,683 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 460 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటివరకు కరోనాతో 4, 61, 849 మంది మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
24 గంటల్లో ఇండియాలో 11,961 మంది కరోనా నుంచి కోలుకోగా 52,69,139 మంది టీకాలు తీసుకున్నారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 109.63 కోట్ల మందికి టీకాలు తీసుకున్నారు.