మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 నవంబరు 2021 (09:33 IST)

మాస్ కా మాస్టర్స్ : నేడు 'నాటు నాటు' ఫుల్ సాంగ్ రిలీజ్

ఎస్ఎస్ రాజమౌళి, ఎన్టీఆర్, చెర్రీల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. జనవరి 7వ తేదీన విడుదలయ్యే ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన దోస్తీ మాట‌కు మాంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక నాటు నాటు అంటూ సాగే సెకండ్‌ సింగిల్‌ని నవంబ‌రు 10వ తేదీన సాయంత్రం 4 గంటలకు విడుద‌ల చేయనున్నారు.
 
ఇప్పటికే నాటునాటు సాంగ్ ప్రోమో విడుద‌ల చేయ‌గా, ఇందులో రామ్ చ‌ర‌ణ్ , ఎన్టీఆర్ క్లాస్ లుక్‌లో మాస్ స్టెప్పులు వేస్తున్న‌ట్టుగా వీడియోని చూస్తుంటే అర్ధ‌మ‌వుతుంది. వెండితెర‌పై వీరిద్ద‌రు చేసే ర‌చ్చ‌కి బాక్సాఫీస్ షేక్ అవ్వ‌డం ఖాయంగా కనిపిస్తుంది. 
 
హై ఓల్టేజ్ డ్యాన్స్ నెంబర్‌ని తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాటను విడుదల చేయ‌నుండ‌గా, తెలుగులో ‘నాటు నాటు’ అంటూ ఆ పాట సాగనుంది. బుధవారం సాయంత్రం నాలుగు గంట‌ల‌కు ఫుల్ సాంగ్ రిలీజ్ కానుంది. అయితే, పాట చిత్రీకరణ సమయంలో రామ్ - చెర్రీలు కాస్త రిలీక్స్ అవుతున్నపుడు తీసిన ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
కాగా, ఈ భారీ హిస్టారికల్‌ మల్టీస్టారర్‌పై నేషనల్‌ వైడ్‌గా భారీ అంచనాలున్నాయి. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురంభీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తున్న ఈ చిత్రంలో చరణ్‌ సరసన అలియాభట్‌, ఎన్టీఆర్‌ సరసన ఒలివియా మోర్రీస్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు.