సోమవారం, 27 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 అక్టోబరు 2025 (12:18 IST)

Wedding: భాంగ్రా నృత్యం చేస్తూ వధువు మృతి.. పెళ్లికి కొన్ని గంటలకు ముందే...?

bhangra dance
bhangra dance
పెళ్లి రిసెప్షన్‌లలో డ్యాన్స్ చేయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. తాజాగా పంజాబ్‌లో వివాహానికి ఒక రోజు ముందు గుండెపోటుతో వధువు ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్, ఫరీద్‌కోట్‌లో జరిగిన ఈ విషాద ఘటనకు చెందిన వివరాల్లోకి వెళితే.. బర్గారి గ్రామానికి చెందిన పూజ అనే యువతి పక్క గ్రామస్థుడైన యువకుడిని ప్రేమించింది. అతను కూడా పూజను ఇష్టపడ్డాడు. 
 
ఈ విషయం ఇరు కుటుంబాలకు చెప్పడంతో దుబాయ్‌లో పనిచేస్తున్న అతడితో పెళ్లికి రెండు కుటుంబాలు అంగీకరించాయి. అక్టోబర్ 24న వీరిద్దరికి పెళ్లి ఖాయమైంది. 
 
పెళ్లి సమయానికి దుబాయ్‌ నుంచి పెళ్లికుమారుడు వచ్చాడు. అక్టోబరు 23 రాత్రి అమ్మాయి ఇంట్లో జాగరణ్‌ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పెళ్లికూతురు ఉత్సాహంగా భాంగ్రా నృత్యం చేస్తూ ఎంజాయ్‌ చేసింది. 
 
ఇంతలోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన ఆమెను ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఫలితంగా పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట విషాదం నిండింది.