సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 5 నవంబరు 2021 (11:27 IST)

ఆచార్యలోని పూజా, చ‌ర‌ణ్ నీలాంబ‌రి.. పాట‌కు స్పంద‌న‌

Pooja- charan
నీలాంబ‌రి.. నీలాంబ‌రి.. నీలా ఎవ‌రే మ‌రీ.. అంటూ రామ్‌చ‌ర‌ణ్‌, పూజీ హెగ్డేను చూసి ఆల‌పించే పాట దీపావ‌ళినాడు విడుద‌లైంది. పూర్తి పాట‌ను శుక్ర‌వారం ఉద‌యం విడుద‌ల చేశారు. ఈ పాట‌కు మంచి స్పంద‌న ల‌భించింద‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన చిత్రం 'ఆచార్య'. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. మ‌రోవైపు రాం చరణ్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. పూజా హెగ్డే  చ‌ర‌ణ్‌కు జోడీగా న‌టించింది.
 
ఇక ఇందులో న‌గ్జ‌లిజం నేప‌థ్యంకూడా ఓ అంశంగా వుంది. కొర‌టాల త‌న బ్రాండ్ ను ఇందులో చూపించ‌నున్నారు. ఇప్ప‌టికే చిరంజీవి, కాజ‌ల్‌, సంగీత ల‌పై రిలీజైన లాహె లాహే.. సాంగ్‌కు ఊహించ‌ని మైలేజ్ వ‌చ్చింది. శివుని నేప‌థ్యంలో ఈ పాట‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి రాశారు. ఇక ఇప్పుడు నీలాంబ‌రి సాంగ్‌కు మంచి స్పంద‌నే వ‌చ్చింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ముగింపు ద‌శ‌లో వున్న ఈ చిత్రాన్ని నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తున్నారు.