సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 నవంబరు 2021 (11:41 IST)

దీపావళికి ఆచార్య నుంచి సెకండ్ సింగిల్...

Neelambari
టాలీవుడ్‌ సక్సెస్‌ డైరెక్టర్‌.. కొరటాల శివ, మెగస్టార్‌ చిరంజీవి కాంబినేషన్‌‌లో వస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమా మెగా ఫ్యాన్‌ లో ఓ రేంజ్‌ అంచనాలు ఉన్నాయి. ఇందుకు కొర‌టాల చేసిన ప్రతి సినిమా బ్లాక్‌ బ‌స్టర్ హిట్ కావ‌డ‌మే ప్రధాన కార‌ణం. పైగా ఇందులో రామ్‌చ‌ర‌ణ్ కూడా న‌టిస్తుండ‌టంతో అంచ‌నాలు ఓ రేంజ్‌ లో ఉన్నాయి.
 
అయితే ఈ సినిమా షూటింగ్ మొద‌ల‌యిన‌ప్పటి నుంచి ఇప్పటికే చాలా సార్లు వాయిదా ప‌డింది. ఇక ఇందులో కాజల్‌, పూజా హెగ్డే నటిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి బిగ్‌ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా సెకండ్‌ సింగిల్‌ ను దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. 
 
నీలాంబరి అని సాగే… లిరికల్‌ సాంగ్‌ ను నవంబర్‌ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్‌ ను వదిలింది చిత్ర బృందం. నవంబర్‌ 5 వ తేదీన ఉదయం 11.05 గంటలకు ఈ పాటను విడుదల చేయనుంది చిత్ర బృందం. ఇక ఈ అప్డేట్‌ తో మెగా ఫ్యాన్స్‌ లో నూతన ఉత్సాహం నెలకొంది.