ఆచార్య రిలీజ్ డేట్ ఖరారు: ఫిబ్రవరి 4, 2022న రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నట్టు చిరంజీవి ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి కాగా.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది వేసవి కానుకగా థియేటర్‌లలో అలరించాల్సిన ఈ సినిమా... కరోనా కారణంగా చిత్రీకరణ ఆలస్యమవడంతో విడుదల వాయిదా పడింది.
తొలుత దసరా కానుకగా తీసుకువస్తారని అందరూ అనుకున్నారు. కానీ, ప్రస్తుతం పరిస్థితులు పూర్తి సానుకూలంగా లేకపోవడం, నిర్మాణానంతర కార్యక్రమాలు ఇంకా పూర్తి కాకపోవడంతో వచ్చే ఏడాదికి వాయిదా పడింది.
కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజాహెగ్డే తళుక్కున మెరవనుంది. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్న ఆచార్యను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది.