గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (16:41 IST)

రామ్‌చ‌ర‌ణ్ ఆవిష్క‌రించిన‌ అన్నపూర్ణ స్టూడియోస్ వారి - అనుభవించు రాజా టీజర్

Raj tarun, supriya, charan, srinu
రాజ్ తరుణ్, డైరెక్టర్ శ్రీను గవిరెడ్డి కాంబినేషన్‌లో పూర్తిస్థాయి వినోదాత్మ‌కంగా రూపొందుతోన్న చిత్రం `అనుభవించు రాజా`. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి  సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
 
ఇటీవ‌లే నాగార్జున రిలీజ్ చేసిన `అనుభ‌వించు రాజా` ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. గురువారంనాడు చిత్ర టీజ‌ర్‌ను రామ్ చరణ్ విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, ‘అనుభవించు రాజా టీజర్ చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంది. చాలా ఎంజాయ్ చేశాను..మీకు కూడా నచ్చుతుంది. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అని రామ్ చరణ్ అన్నారు.
 
టీజ‌ర్‌లో ఏముందంటే,
భీమవరంలో కోడి పందెం సెటప్ ను చూపిస్తూ పందెం రాయుళ్లందరికీ స్వాగతం పలకడంతో ఈ టీజర్ ప్రారంభమైంది. 'అనుభవించు రాజా..' అంటూ సూపర్ హిట్ ఓల్డ్ సాంగ్ ప్లే అవుతుండగా రాజ్ తరుణ్ ను విలాసాలకు అలవాటు పడిన జూదగాడిగా రాజ్ తరుణ్ తన స్టైల్లో ఎంట్రీ ఇస్తారు. పందెం కాయడం, బెట్టింగ్ వేయడం, గ్యాంబ్లింగ్ చేయడం, పేకాట ఆడటం, రికార్డు డ్యాన్సులు చేయడం వంటి మాస్ ఎలిమెంట్స్‌ కనిపిస్తున్నాయి.
 
"అయినా బంగారం గాడు ఊర్లోని ఆడి పుంజు బరిలోని ఉండగా.. ఇంకొకడు గెలవడం కష్టం..." అని మీసాలు తిప్పుతూ రాజ్ తరుణ్ కనిపించాడు. ఆయనలోని ఎనర్జీ మొత్తం టీజర్‌లో కనిపిస్తోంది.  ఇక టీజర్ చివర్లో 'నువ్వు గెలిచి నా పరువు కాపాడితే.. సాయంత్రం నీ గంప కింద నాలుగు పెట్టలు పెడతా' అంటూ పందెం పుంజుతో మాట్లాడటం అలరిస్తోంది. గోపీ సుందర్ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి అతి పెద్ద బలంగా మారింది.
 
ఎనర్జిటిక్ గా ఉండే రాజ్ తరుణ్ కు బంగారం పాత్రకు కరెక్ట్ గా సూట్ అయ్యాడు. గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్ కు మరో ప్రధాన ఆకర్షణ. సినిమాటోగ్రాఫర్ నగేష్ బానెల్ కెమెరా పనితనం కారణంగా గ్రామీణ వాతావరణం కలర్ ఫుల్ గా.. ప్రొడక్షన్ డిజైన్ గ్రాండ్ గా కనిపిస్తుంది.
 
- సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన కాశిష్ ఖాన్ హీరోయిన్ గా నటిస్తోంది. పోసాని కృష్ణమురళి, ఆడుకాలమ్ నరేన్,  అజయ్, సుదర్శన్, టెంపర్ వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ - రవి కృష్ణ - భూపాల్ రాజు - అరియానా తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. భాస్కర భట్ల ఈ చిత్రానికి  పాటలు అందిస్తున్నారు. చోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
 
ప్రస్తుతం ఈ చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక త్వరలోనే థియేటర్లో సందడి చేసేందుకు అనుభవించు రాజా రెడీ అవుతోంది.