పేచ్ వర్క్ మినహా ఆర్.ఆర్.ఆర్. పూర్తి
RRR-still
ఇక త్వరలో ఆసక్తికరమైన అప్‌డేట్లను వెల్లడిస్తామని ఆ పోస్ట్‌లో పేర్కొంది. అంటే ఇప్పటికే కొన్ని సినిమా విడుదల తేదీలు ప్రకటించేశారు. కానీ ఆర్.ఆర్.ఆర్. విడుదల ఇంకా సందిగ్థంలో వుంది. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు బాగోలేవు కనుక కరోనా మూడోవేవ్ కూడా వస్తే పూర్తిగా ఆర్.ఆర్.ఆర్. విడుదల మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఉక్రెయిన్ లో చేసిన చివరి షెడ్యూల్ తో ఈ సినిమా మొత్తం పూర్తయింది. మిగిలిన పేచ్‌వర్క్ హైదరాబాద్‌లోనే షూట్ చేయనున్నారు. అధునాతన సాంకేతికతతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆ వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
తర్వాతి కథనం
