ఎవరు మీలో కోటీశ్వరుడు.. ఎవరు మీలో కోటీశ్వరులుగా ఎందుకు మార్చారు?
జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన హోస్ట్‌గా ప్రముఖ బుల్లితెర జెమినీ టీవిలో ఎవరు మీలో కోటీశ్వరుడు అనేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇప్పటికే ఎంతో పాపులర్ అయిన ఈ గేమ్ షో పేరు ఇపుడు మారిపోయింది. గతంలో ఎవరు మీలో కోటీశ్వరుడుగా ఉండేది. కానీ, ఇపుడు ఎవరు మీలో కోటీశ్వరులుగా మార్చారు.
దీనికి ప్రధాన కారణం సినీ నటుడు, ఈ షోకు ప్రధాన యాంకర్ జూనియర్ ఎన్టీఆర్ కావడం గమనార్హం. ఈ షోకు కేవలం పురుషులు, యువకులు మాత్రమే కాదు.. యువతులు, మహిళలు కూడా ఉన్నారు. దీంతో మీలో ఎవరు కోటీశ్వరుడు అయితే బాగుండదని భావించి, ఎవరు మీలో కోటీశ్వరులుగా మార్చారు.