సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 ఆగస్టు 2021 (14:47 IST)

చరణ్ బ్లాక్ హూడీ, బ్లాక్ జీన్స్ ధరించి, మ్యాచింగ్ మాస్క్, టోపీ.. వైరల్ ఫోటో

Ramcharan
తారక్, చరణ్‌తో సహా ప్రధాన తారాగణంపై పాట చిత్రీకరణను పూర్తి చేయడానికి "ఆర్ఆర్ఆర్" బృందం ఉక్రెయిన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హైదరాబాద్‌కు తిరిగొచ్చాడు. 
 
విమానాశ్రయంలో చరణ్ నడుచుకుంటూ వస్తున్న పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ "ఆర్ఆర్ఆర్" చివరి షెడ్యూల్‌ని ఉక్రెయిన్‌లో ముగించుకుని తిరిగి హైదరాబాద్ వచ్చాడు. 
 
చరణ్ బ్లాక్ హూడీ, బ్లాక్ జీన్స్ ధరించి, మ్యాచింగ్ మాస్క్, టోపీ ధరించాడు. అయినప్పటికీ అభిమానులు ఆయనను గుర్తు పట్టేశారు. మిగతా "ఆర్ఆర్ఆర్" టీం కూడా హైదరాబాద్ కు చేరుకున్నట్టు సమాచార. ఎన్టీఆర్ నిన్ననే హైదరాబాద్ వచ్చాడు. 
 
రాజమౌళి అండ్ టీమ్ ఉక్రెయిన్‌లో 10 రోజుల షెడ్యూల్ పూర్తి చేసుకుని మొత్తానికి హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. సినిమా పూర్తయిన సందర్భంగా రాజమౌళి అండ్ టీం కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకున్నారు. 
 
"ఆర్ఆర్ఆర్" బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేయడానికి రాజమౌళి కొత్త షెడ్యూల్‌ని ప్లాన్ చేస్తున్నాడు. త్వరలో చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించి, "ఆర్ఆర్ఆర్" రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తుందని అంటున్నారు.