శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 ఆగస్టు 2021 (15:35 IST)

శ్రద్ధా కపూర్‌తో ఎన్టీఆర్ రొమాన్స్.. నిజమేనా..?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ కెప్టెన్ కొరటాల శివ కాంబినేషన్‌లోజనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పాన్ - ఇండియా మూవీగా రూపొందనున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో తారక్ నెవర్ సీన్ బిఫోర్ రోల్‌లో దర్శనమివ్వనున్నారని సమాచారం. 
 
యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో తారక్ కి జోడీగా ఓ బాలీవుడ్ బ్యూటీ నటించబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య కియారా అద్వాని పేరు ప్రముఖంగా వినిపించినా.. ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.
 
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇందులో `సాహో` భామ శ్రద్ధా కపూర్ నాయికగా నటించే అవకాశముందట. పాన్ - ఇండియా మూవీ కావడం.. శ్రద్ధకి హిందీనాట మంచి సక్సెస్ గ్రాఫ్ ఉండడంతో ఆమెకే ఓటేస్తున్నారట మేకర్స్. త్వరలోనే తారక్ - కొరటాల సెకండ్ జాయింట్ వెంచర్‌లో శ్రద్ధా కపూర్ ఎంట్రీపై క్లారిటీ రానుంది.