గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 ఆగస్టు 2021 (20:34 IST)

"రైతు"గా ఎన్టీఆర్.. బాలయ్య కోసం కథ రాసి తారక్‌ను దించేశాడు..(video)

క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ ప్రస్తుతం తన తదుపరి సినిమా అయిన "రంగమార్తాండ" నిర్మాణాంతర పనులతో బిజీగా ఉన్నాడు. మరాఠీ సినిమా "నటసామ్రాట్" కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా పూర్తయిన తర్వాత కృష్ణవంశీ ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. 
 
ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ డేట్స్ గురించి ఎంక్వయిరీ చేయడానికి సైతం వెళ్లారు కృష్ణవంశీ. 2006లో ఎన్టీఆర్ మరియు కృష్ణ వంశీ "రాఖీ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది.
 
మరోవైపు కృష్ణ వంశీ బాలకృష్ణ హీరోగా "రైతు" అనే సినిమా చేయాలనుకున్నారు కానీ ఆ సినిమా కూడా ఇప్పట్లో మొదలయ్యే దాఖలాలు లేవు. అయితే తాజా సమాచారం ప్రకారం కృష్ణవంశీ "రైతు" కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి అదే కథను ఎన్టీఆర్‌ను హీరోగా పెట్టి చేయాలని అనుకుంటున్నారట. 
 
అయితే దీని గురించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. మరోవైపు "రంగమార్తాండ" సినిమాలో ప్రకాష్ రాజ్ మరియు రమ్యకృష్ణ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఈ ఏడాది ఆఖరులో విడుదల కానుంది.