శనివారం, 7 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 11 ఆగస్టు 2021 (18:47 IST)

ధ‌ర ద‌మ్‌..ద‌మ్‌.. ధ‌ర ద‌మ్ ద‌మ్ ..అంటూ హుషారుగా చ‌ర‌ణ్‌, ఎన్‌.టి.ఆర్‌.

NTR-charan
స్నేహ‌మేరా జీవితం, స్నేహ‌మేరా శాశ్వ‌తం.. అంటూ అప్ప‌ట్లో ఎన్‌.టి.ఆర్‌., కైకాల సినిమాలోని పాట గుర్తిండే వుంటుంది. స్నేహంమీద చాలా సినిమాలు వ‌చ్చాయి. పాట‌లూ వ‌చ్చాయి. కానీ రాజ‌మౌళి చేస్తున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమాలో ఫ్రెండ్ షిప్‌కోసం వినూత్నంగా ఓ ప్ర‌మోష‌న్ గీతాన్ని రూపొందించారు. ఇటీవ‌లే ఫ్రెండ్ షిప్‌డేనాడు సంగీత ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఐదు భాష‌ల్లో ఐదుగురు గాయ‌కుల‌తో కొత్త ప్ర‌క్రియ చేశాడు. ఆ త‌ర్వాత నుంచి ప్ర‌మోష‌న్ విభిన్నంగా చేస్తున్నాడు.
 
బుధ‌వారంనాడు ఓ వీడియోను బ‌య‌ట‌కు విడుద‌ల చేశారు. స్నేహం గురించి సాగే పాట అది. ఓ ఖ‌రీదైన కారులో ఎన్‌.టి.ఆర్‌., రామ్‌చ‌ర‌ణ్‌లు ప్ర‌యాణిస్తుండ‌గా పాట వ‌స్తుంది. చివ‌ర్లో ధ‌ర ద‌మ్‌..ద‌మ్‌.. ధ‌ర ద‌మ్ ద‌మ్ ..అంటూ ఎన్‌.టి.ఆర్‌. గాత్రం కూడా వినిపిస్తుంది. ఇలా ఆస‌క్తిక‌ర‌మైన ప‌బ్లిసీటీతో పైసా ఖ‌ర్చులేకుండా సోష‌ల్‌మీడియా ద్వారా బ‌లే ప్లాన్ చేశాడు రాజ‌మౌళి. బాహుబ‌లికి కూడా అలాగే చేసి స‌క్సెస్ అయ్యాడు. మ‌రి ఆర్‌.ఆర్‌.ఆర్‌.లో దాదాపు భార‌త చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని ప్ర‌ముఖ న‌టీన‌టులుంతా న‌టించేశారు. ఇంకేముంది ప‌బ్లిసిటీ పండ‌గ చేసేస్తున్నాడు రాజ‌మౌళి. త్వ‌ర‌లో మ‌రో వినూత్న‌మైన కాస్పెప్ట్ రాబోతుందట‌. అదేమిటో వెయిట్ చేయండ‌ని రాజ‌మౌళి ట్వీట్ చేశాడు.