గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 ఆగస్టు 2021 (13:29 IST)

ఆర్ఆర్ఆర్ సెట్‌లో చెర్రీ అసహనం.. ఎన్టీఆర్ ఏమన్నారో..?

ఆర్ఆర్ఆర్ సెట్‌లో ఎన్టీఆర్ మాటలకు రామ్ చరణ్ అసహనం వ్యక్తం చేసారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లాస్ట్ షెడ్యూల్ ఉక్రెయిన్‌లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇవ్వనున్నారు. 
 
ఈ సందర్భంగా ఎన్టీఆర్.. రామ్ చరణ్‌ను ఉద్దేశిస్తూ చరణ్.. డ్రమ్స్ ప్రాక్టీస్ అయిందా అంటే అక్కడ ఉన్న బల్లపై డ్రమ్స్ వాయిస్తూ అయిపోయిందంటూ కాస్త ఫన్నీగా అయిపోయినట్టు సమాధానమిచ్చారు తారక్‌కు చెబుతాడు. 
 
ఈ సందర్భంగా రామ్ చరణ్ కార్తికేయతో మాట్లాడుతూ.. రియల్ డ్రమ్స్ ఏవి.. అంటే టూ మినిట్స్ అంటూ కార్తికేయ సమాధానమిస్తాడు. ఈ సందర్భంగా చరణ్.. మాట్లాడుతూ.. కాస్ట్యూమ్స్ లేవు, ఏమి లేవు, పొద్దునే ఇక్కడ కూర్చొబెట్టారు. దసరాకు రిలీజ్ డేట్ ఉంది అంటూ అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇపుడీ వీడియో వైరల్ అవుతోంది.