శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 ఆగస్టు 2021 (21:35 IST)

RRR రికార్డ్.. టాప్-10లో ట్రెండ్ అవుతున్న ''దోస్తీ'' థీమ్ సాంగ్

బాహుబలి మేకర్ రాజమౌళి ప్రస్తుతం RRR సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి దోస్తీ అనే థీమ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ పాట ఐదు భాషల్లోనూ ఒకే సమయంలో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఇదే రికార్డ్‌ను నమోదు చేసుకుంది. దోస్తీ సాంగ్ యూట్యూబ్ ట్రెండింగ్‌లో టాప్-10లో నిలిచింది. అదీ మూడు రోజుల్లోనే. స్నేహితుల రోజు సందర్భంగా ఈ పాటను విడుదల చేశారు. 
 
ప్రధాన నటులపై ఈ థీమ్ సాంగ్ రూపొందించడం జరిగింది. ఇంకో ఒక్కో భాషలో ఒక్కో సూపర్ స్టార్ ఈ పాటను ఆలపించారు. దీంతో ఈ పాట విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంకా కేవలం 3 రోజుల వ్యవధిలో సుమారు 25 మిలియన్ల వీక్షణలను పొందాయి. మొత్తం 5 భాషల్లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న థీమ్ సాంగ్.. RRRపై భారీ అంచనాలను పెంచేసింది. 
 
ఈ చిత్రంలో బహుళ పరిశ్రమల నుండి సమిష్టి తారాగణం ఉంది. తెలుగులో ఎన్టీఆర్ జూనియర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, అలియా భట్ తదితరులు నటిస్తున్నారు. డివివి దానయ్య నిర్మించిన, ఆర్‌ఆర్‌ఆర్‌కి జక్కన్న దర్శకత్వం వహించారు. 
 
PEN స్టూడియోస్ ఉత్తర భారతదేశం అంతటా థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను పొందింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల ఎలక్ట్రానిక్ హక్కులను కూడా కొనుగోలు చేసింది. పెన్ మరుధర్ ఈ చిత్రాన్ని నార్త్ టెరిటరీలో పంపిణీ చేయనున్నాడు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రం అక్టోబర్ 13, 2021 న దసరా పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.