నన్ను లేపేస్తానంటే ఆయనను సజ్జల అభినందిస్తారా?: RRR కామెంట్స్
అమర్ రాజా కంపెనీపై సజ్జల రామకృష్ణారెడ్డి ఒకమాటైతే మంత్రి బొత్సది ఇంకోమాటగా వుందనీ, గతంలో ఈ కంపెనీకి వైస్సార్ భూకేటాయింపులు చేసారని చెప్పుకొచ్చారు వైసిపి ఎంపి రఘురామకృష్ణరాజు. తన అంతు చూస్తానని ఎంపి గోరంట్ల మాధవ్ అన్నారని చెబితే ఆయనను సజ్జల అభినందించారని తనకు తెలిసిందన్నారు.
నేను ప్రెస్ మీట్ పెడితే లేపేస్తాం అని అంటున్నారు. నేను చేస్తున్నది ధర్మమైన పోరాటం. మీ ఉడుత ఊపులకు నేను భయపడనంటూ వ్యాఖ్యానించారు రఘురామ. అవసరమైతే విశాఖ ఉక్కు కోసం తను కూడా తన పదవికి రాజీనామా సమర్పిస్తానని చెప్పారు.