1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 జులై 2021 (13:15 IST)

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలకు ఓఎస్డీగా తెలంగాణ అధికారి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వైకాపా సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఓఎస్డీగా తెలంగాణ అధికారిని ప్రభుత్వం నియమించింది. ఆయన పేరు దశరథరామిరెడ్డి. ఈయన తెలంగాణ ప్రభుత్వంలో జైళ్ళశాఖ సూపరెండెంట్‌గా ఉన్నారు. ఈయనను సజ్జలకు ‎ఓఎస్డి‌గా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను డిప్యూటేషన్‌పై ఇక్కడ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఆయనను ఏపీలో నియమించేందుకు ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్‌కు అంగీకరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఏపీ సర్కారు కోరింది. దీనిపై స్పందించిన తెలంగాణ సర్కార్.. రెండు సంవత్సరాల డిప్యూటేషన్‌కు అంగీకరించింది. దశరథరామిరెడ్డికి ఎలాంటి టిఏ డిఏలు వర్తించవని ఆయన విజ్జప్తి మేరకే ఈ నియామకం జరిగిందని ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఇక దీంతో రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.