1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (14:30 IST)

వలంటీర్లు కాదు. ఉద్యోగులు ప్రజల్లో భాగం. వారు ఓట్లు వేస్తారు : సజ్జల

వలంటీర్లు కాదు. ఉద్యోగులు ప్రజల్లో భాగం. వారు ఓట్లు వేస్తారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, వలంటీర్లు వారి ఉద్యోగానికి వచ్చిన అధికారాన్ని ఉపయోగిస్తే చట్టరీత్యా తప్పు. వలంటీర్లు విషయానికి వస్తే.. వారి పేరులోనే ఉంది. వారు రెగ్యులర్‌ ఎంప్లాయిస్‌ కాదు. కింద స్థాయిలో ప్రతి 100 ఇళ్లకు బూత్‌ కమిటీ సభ్యుడు ఉన్నారు. గత ఎన్నికల్లో పని చేశారు. మాకు వేరే ఎవ్వరూ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ప్రజలే జగనన్న మాకు ఇంత సాయం చేశారని చెబుతున్నారు. వలంటీర్లను వాడుకోవాల్సిన అవసరమూ వైయస్‌ఆర్‌సీపీకి లేదు. ఇకముందు ఉండదు’. 
 
‘నిన్న చంద్రబాబు మాటల్లోనూ వచ్చాయి. డిపాజిట్లు ఎవరికి రావాలి. మేం నెంబర్‌ వన్‌ ఉంటే.. వందమెట్ల కింద సెకండ్‌ ప్లేస్‌ కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీనికోసం సెంట్రల్‌ ఫోర్స్‌ దింపాలని మాట్లాడుతున్నారు. సుదూర ప్రాంతాల్లో ఉంటే భ్రమలు క్రియేట్‌ చేయవచ్చేమో. వాళ్లకు తెల్సు... అక్కడ (తిరుపతి ఉప ఎన్నికలో) ఏం జరుగుతోందో. అధికార దుర్వినియోగం అనేది టఫ్‌ ఫైట్‌ ఉంటే.. ఓడిపోతాం అంటేనే. అప్పుడు మా అధ్యక్షుడు నుంచి అందరూ కదలరా? సీఎం రావాలని అనుకున్నది కూడా ప్రజలను ఓటర్లను అభ్యర్థించాలని కోరుకున్నారు. కానీ కోవిడ్‌ వల్ల రాలేదు. 
 
రేపు వచ్చే గెలుపు, మెజార్టీ ప్రజల అభిమానంతో వచ్చేది. ఓటమికి ముందే గ్రౌండ్‌ సిద్ధం చేసుకుంటున్నారు’. ‘ప్రజలు కోవిడ్‌ వల్ల జాగ్రత్తగా రావాలి. మేం, మా పార్టీ గెలుస్తుందనే వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. పంచాయితీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు వచ్చాయో.. అంత ఓటర్లు కూడా జగన్‌ వెంట ఉన్నారని కళ్ల ముందు కనిపిస్తోంది. దానిబట్టి ఫలితాలు రావాలి. కొంత తగ్గితే అటూ ఇటూ ఉండొచ్చు కానీ ఏదైనా సరే.. మంచి మెజార్టీతో ప్రజల ఆశీస్సులు ఉంటాయి’. ఈ ఎన్నికలను వైయస్‌ఆర్‌సీపీ రెఫరెండంగా తీసుకుంది. సంక్షేమ పథకాలే వైయస్‌ఆర్‌సీపీని గెలిపిస్తాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.