శనివారం, 2 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (13:29 IST)

వైఎస్ వివేకా హత్య కేసు : అసలు సూత్రధారులు వారే.. ఏపీ వెంకటేశ్వర రావు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్, మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఏపీ రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు సంచలన విషయాలను వెల్లడించారు. ఈ మేరకు ఆయన సీబీఐకి లేఖ రాశారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన చాలా సేపటిదాకా పోలీసులను కొందరు ప్రజాప్రతినిధులు లోపలికి రానివ్వలేదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. 
 
పోలీసులను వారు కావాలనే అడ్డుకున్నారని ఆరోపించారు. గుండెపోటుతో మరణించారని నమ్మించేందుకు కొందరు ఎంపీలు ప్రయత్నించారన్నారు. వివేకానంద రెడ్డిని హత్య చేసిన తర్వాత.. ఇల్ల కడగడం దగ్గర్నుంచి, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించేదాకా ఎంపీ అవినాష్ రెడ్డి తన అధీనంలోనే ఉంచుకున్నారని లేఖలో పేర్కొన్నారు.
 
ఆ సమయంలో మీడియాను కానీ, ఇంటెలిజెన్స్ సిబ్బందినిగానీ, పోలీసులనుగానీ లోపలికి అనుమతించలేదని పేర్కొన్నారు. హత్య జరిగి ఏడాది గడుస్తున్నా దర్యాప్తులో ఇంత వరకు పురోగతి లేదన్నారు. కేసు పూర్తి వివరాలు తన వద్ద ఉన్నాయని అప్పటి దర్యాప్తు అధికారి ఎన్.కే.సింగ్‌కు ఫోన్ చేసి చెప్పినా, ఆయన వైపు నుంచి కనీస స్పందన కూడా లేదని వాపోయారు. హత్య జరిగినప్పుడు తానే ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నానని, అందుకే కావాలనే తనను విధుల నుంచి తొలగించడమే కాకుండా, కక్ష సాధిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.