1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

బాబాయ్‌ను వేసేసింది అబ్బాయే : నారా లోకేశ్

ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోమారు విమర్శలు గుప్పించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తనకు, తన కుటుంబానికి ఎలాంటి పాత్ర లేదని తిరుమల వెంకన్న సాక్షిగా ప్రమాణం చేశానని... నీకు, నీ కుటుంబానికి సంబంధం లేదని వెంకన్నపై ప్రమాణం చేయాలని తాను విసిరిన ఛాలెంజ్‌కు భయపడి పులివెందుల పిల్లి పారిపోయిందని ఎద్దేవా చేశారు. 
 
ఈ రోజుతో వైఎస్ వివేకా హత్య కేసులో ఉన్న మిస్టరీ వీడిపోయిందని చెప్పారు. బాబాయ్‌ని వేసేసింది అబ్బాయే అని అన్నారు. వైయస్ వివేకా హత్య కేసులో తమకు సంబంధం లేదని తిరుపతిలోని అలిపిరిలో వెంకన్న సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్పారు. నారా లోకేశ్ బుధవారం తిరుపతి అలిపిరి వద్దకు చేరుకుని అక్కడున్న గరుడ సర్కిల్ వద్ద ప్రమాణం చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కత్తితో బతికే వాడు కత్తికే చస్తాడని అన్నారు. జగన్ రెడ్డి ఇక్కడకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. దైవ సాక్షిగా ప్రమాణం చేసేందుకు ఎందుకు భయపడుతున్నారని అన్నారు. జగన్ తన నివాసం నుంచి 45 నిమిషాల్లో ఇక్కడకు రావచ్చని చెప్పారు.