బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 ఏప్రియల్ 2021 (11:00 IST)

మనిషి మనిషే.. దేవుడు దేవుడే... మనిషి దేవుడు కాలేడు : చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిని విష్ణువుతో పోల్చిన తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరోక్షంగా మండిపడ్డారు. ఆయన గురువారం తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారం కోసం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారిని చంద్రబాబు దర్శించుకున్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేవుడే దేవుడే... మనిషి మనిషే... మనిషి ఎప్పుడు దేవుడు కాలేడన్నారు. మనుషులను దేవుడితో పోల్చడం తప్పన్నారు. ఇప్పుడే కాదు... గతంలోనూ తిరుమలలో చాలా అపవిత్ర కార్యక్రమాలు జరిగాయన్నారు. 
 
పింక్ డైమండ్ మాయం వంటి ఆరోపణలు చేసిన వ్యక్తిని.. మళ్ళీ నియమించడం మంచి సాంప్రదాయం కాదన్నారు. అలా చేయడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని సూచించారు. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందన్నారు. రాష్ట్రానికి అతి పెద్ద ఆస్తి వెంకటేశ్వర స్వామి అని పేర్కొన్నారు. 
 
తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అపవత్రాలకు పాల్పడిన వారిని తిరిగి శ్రీవారి సన్నిధిలో విధులకు నియమించడం అనేది అతిపెద్ద తప్పుగా చంద్రబాబు పేర్కొన్నారు.