శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 3 ఏప్రియల్ 2021 (15:52 IST)

TDP భూస్థాపితం అవడానికి కృషి చేసిన మీ అందరికి పేరుపేరునా ధన్యవాదాలు.. ఎవరు?

సోషల్ మీడియా ట్విట్టర్లో #EndOfTDP అంటూ ఈ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇందులో తెలుగుదేశం పార్టీ పరిస్థితిపై ఘోరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఎవరు చేస్తున్నారన్నది తెలియాల్సి వుంది.
 
కాగా తెదేపా చీఫ్ రాబోయే జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకటన తర్వాత జ్యోతుల నెహ్రూ పార్టీ ఉపాధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. మరికొంతమంది నాయకులు సైతం చంద్రబాబు నాయుడు నిర్ణయంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఈ ట్రోల్ ట్రెండ్ అవుతోంది.