ఆదివారం, 24 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శనివారం, 23 ఆగస్టు 2025 (19:19 IST)

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

Jatadhara, Divya Khosla first look
Jatadhara, Divya Khosla first look
సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు.
 
హై-ఆక్టేన్ విజువల్స్, పౌరాణిక ఇతివృత్తాలతో ఈ చిత్రం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది. ఇటివల రిలీజ్ అయిన టీజర్ నేషనల్ వైడ్ గా వైరల్ అయ్యింది. ఈ రోజు మేకర్స్ సితారగా దివ్య ఖోస్లాను పరిచయం చేశారు. బ్యూటీఫుల్ అండ్ క్లాసిక్ గా కనిపించిన  దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్ అదిరిపోయింది.  
 
జీ స్టూడియోస్‌, ప్రెర్ణా అరోరా ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమాను ఉమేష్ కుమార్ బన్సాల్, ప్రెర్ణా అరోరా  ప్రొడ్యూస్ చేస్తున్నారు. మ్యూజిక్ జీ మ్యూజిక్ కో., క్రియేటివ్ డైరెక్షన్‌ దివ్య విజయ్‌. జీ స్టూడియోస్‌ స్ట్రాటజిక్ విజనరీ ఉమేష్ కుమార్ బన్సాల్ మద్దతుతో, ప్రొడ్యూసర్స్ శివిన్ నారంగ్, నిఖిల్ నందా, అరుుణ అగర్వాల్, శిల్ప సింగాల్, కో-ప్రొడ్యూసర్స్ అక్షయ్ కేజ్రివాల్, కుస్సుం అరోరా ఈ ప్రాజెక్ట్‌ కు మద్దత్తు ఇస్తున్నారు. టాయిలెట్: ఎక్ ప్రేమ్ కథ, ప్యాడ్‌మాన్, పరి వంటి హిట్స్ ఇచ్చిన ప్రెర్ణా అరోరా మళ్లీ  హై-కాన్సెప్ట్ సినిమాను రూపొందిస్తున్నారు.
 
విజనరీ టీమ్‌, జానర్ బౌండరీలు చెరిపేసే కాన్సెప్ట్‌తో, ‘జటాధర’ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ థియేట్రికల్ రిలీజ్‌లలో ఒకటిగా వస్తోంది. దేశవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ‘జటాధర’  ఇండియా సినిమాలో నెక్స్ట్  మైథాలజికల్ ఎపిక్‌గా మారబోతోంది