శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 ఆగస్టు 2021 (14:16 IST)

జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం? క్లారిటీ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ టీం

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు నటిస్తున్నారు. అయితే, ఈ చిత్రం షూటింగ్ సంద‌ర్భంగా ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌కు సంబంధించిన ఓ వీడియోను శనివారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ వీడియోను బాగా ప‌రిశీలించి చూస్తే ఎన్టీఆర్ క‌ను బొమ్మ‌పైన ఓ గాయం క‌న‌ప‌డుతోంది. 
 
ఈ విష‌యాన్ని గుర్తించిన అభిమానులు ఆయ‌న‌కు ఏమైంద‌ని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ వైర‌ల్ అవుతోంది. దీంతో ఆర్ఆర్ఆర్ టీమ్ దీనిపై వివ‌ర‌ణ ఇచ్చింది. ఎన్టీఆర్ ఎడమ క‌నుబొమ్మ పైన ఉన్న ఆ గాయం నిజ‌మైంది కాద‌ని, షూటింగ్‌లో భాగంగా పెట్టింద‌ని చెప్పింది. దీంతో అభిమానులకు క్లారిటీ వ‌చ్చింది.
 
కాగా, ఆర్ఆర్ఆర్ మూవీలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. వారిద్ద‌రు చిరున‌వ్వులు చిందిస్తూ కూర్చున్న ఈ వీడియో అభిమానులను అల‌రిస్తోంది. కాగా, ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే దాదాపు పూర్త‌యింది. ఇటీవలే ఈ చిత్రంలోని ఓ లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.