శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , గురువారం, 12 ఆగస్టు 2021 (14:32 IST)

శ్రీశైలం చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా

క‌ర్నూలు జిల్లా శ్రీశైలానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేరుకున్నారు. మ‌ల్లిఖార్జున స్వామి దేవ‌స్థానాన్ని సంద‌ర్శించేందుకు వ‌చ్చిన కేంద్ర మంత్రికి ఆల‌య అధికారులు పూర్ణ కుంభంతో స్వాగ‌తం ప‌లికారు.

హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి శ్రీశైలం సున్నిపెంట‌ హెలిప్యాడ్ కు మధ్యాహ్నం 12.35 గంటలకు చేరుకున్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.

హెలిప్యాడ్ లో అమిత్ షాకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు, ఇంటెలిజెన్స్ ఐజీ శశిధర్ రెడ్డి, డిఐజి వెంకట్రామిరెడ్డి, జిల్లా ఎస్ పి సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి త‌దిత‌రులు స్వాగ‌తం ప‌లికారు.