గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 ఆగస్టు 2021 (13:54 IST)

వైజాగ్ వుడా పార్క్‌కు సమీపంలో వైకాపా కేంద్ర కార్యాలయం

ఏపీలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని విశాఖపట్టణానికి తలించే యత్నాలు జోరుగా సాగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులోభాగంగా, వైజాగ్ వుడా పార్కు సమీపంలో నిర్మాణం పూర్తికావస్తున్న ఒక భవనాన్ని పార్టీ కార్యాలయానికి అనువైనదిగా గుర్తించినట్టు తెలిసింది. 
 
ఆ భవన యజమానితో ఇప్పటికే పలుమార్లు చర్చించినట్టు సమాచారం. మరో రెండు, మూడు నెలల్లో నిర్మాణ పనులు పూర్తవుతాయని, ఆ తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయాన్ని తరలించవచ్చని స్థానిక నేతలు పేర్కొంటున్నారు. 
 
విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... కోర్టులో కేసుల నేపథ్యంలో రాజధాని తరలింపు ఆలస్యమైనా, పార్టీ కేంద్ర కార్యాలయాన్ని మాత్రం అక్టోబరు నాటికి విశాఖలో ప్రారంభించాలన్న పట్టుదలతో ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం.