సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 ఆగస్టు 2021 (22:30 IST)

మనిషి మారకపోతే అంతే సంగతులు... 12 నగరాలు నీట మునుగుతాయట!

Indian Coastal Cities
ధ్రువాల్లోని మంచు కరిగి సముద్రమట్టాలు పెరిగిపోతున్నాయి. తీర ప్రాంతాలు ప్రమాదంలో పడ్డాయి. తుఫానులు, వడ గాల్పులు, అకాల వర్షాలు, ఇతర ప్రకృతి విపత్తులు నిత్యకృత్యంగా మారుతున్నాయి. 
 
ప్రభుత్వాలు, ప్రజల తీరులో మార్పు లేకపోవడంతో మానవాళి ప్రకృతి గీసిన లక్ష్మణరేఖను దాటే స్థితికి చేరుకుంటోంది. మరో ఇరవై ఏళ్లలో భూ ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల మేర పెరగనున్నాయి. 
 
ఈ స్థితికి చేరుకుంటే.. మనిషిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఏంటి ఇదంతా.. అంటారా..? వాతావరణ మార్పులపై అంతర్ ప్రభుత్వ ప్యానల్(ఐపీసీసీ) తాజాగా విడుదల చేసిన 6వ అసెస్‌మెంట్ నివేదికకు సంక్షిప్త రూపం ఇది.
 
ఈ నివేదిక ఆధారంగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా.. సముద్రమట్టాల పెరుగుదలపై అధ్యయనం జరిపింది. ఈ క్రమంలో భారత్‌లోని 12 నగరాలు, టౌన్లు నీట మునిగిపోయే అవకాశం ఉందని అంచనా వేసింది. 
 
ఆ శతాబ్దం చివరి కల్లా.. కండ్ల, ఒఖా, భావ్‌నగర్, ముంబై, మంగళూరు, కొచ్చి, విశాఖపట్నం, చెన్నై వంటి మొత్తం 12 నగరాలు 2.7 అడుగుల లోతు నీటిలో మునిగిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది.