సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (19:08 IST)

90 మిలియ‌న్ వ్యూస్ సాధించిన ఆచార్య సాంగ్‌

Acharya song
మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `ఆచార్య‌` సినిమాలోని `లాహే లాహే.. కొండ‌ల‌చాటున‌..` అనే పాట 90 మిలియ‌న్ వ్యూస్‌కు చేరుకుంది. ఈ సంద‌ర్భంగా త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేస్తూ చిత్ర యూనిట్ చిన్న వీడియోను విడుద‌ల చేసింది. ఇప్ప‌టి జ‌న‌రేష‌న్‌కు త‌గిన‌ట్లు మెగాస్టార్ సినిమాలోని పాట ఆద‌ర‌ణ పొంద‌డం ప‌ట్ల ఆయ‌న అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు సోష‌ల్‌మీడియాలో ఆచార్య తెగ ప్ర‌శంసించేస్తున్నారు. 
 
ఈ పాట‌ల‌ను రామ‌జోగ‌య్య‌శాస్త్రి ర‌చించారు. గుడిలో సంద‌ర్భాను బ‌ట్టి పాట‌ను రాయాల‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కోర‌డంతో తాను శివుడ్ని మ‌దిలో వుంచుకుని అల‌వోక‌గా రాసిన‌ట్లు రామ‌జోగ‌య్య‌శాస్త్రి తెలియ‌జేశారు. ఇందులో ఆధ్యాత్మిక భావన‌తోపాటు విప్ల‌వాత్మ‌క‌మైన అంశం కూడా వుంద‌ని తెలియ‌జేస్తున్నాడు. మ‌ణిశ‌ర్మ బాణీల‌కు అనుగుణంగా రాసిన ఈ పాట చ‌క్క‌గా కుదిరాయ‌ని తెలియ‌జేశారు. మ్యూజిక్ సిట్టింగ్‌లో మ‌ణిశ‌ర్మ‌గారు ఇచ్చిన ఔట్‌పుట్ కూడా బాగా ఉప‌యోగ‌ప‌డింద‌ని తెలిపారు. ఇప్ప‌టికే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చురుగ్గా సాగుతున్న ఈ సినిమాను విడుద‌ల‌తేదీని త్వ‌ర‌లో తెలియ‌జేస్తామ‌ని నిర్మాత నిరంజ‌న్ రెడ్డి తెలియ‌జేస్తున్నారు.