జనవరి 7న ఆర్.ఆర్.ఆర్. డేట్ ఫిక్స్- దసరాకు మరో అప్‌డేట్
RRR release poster
కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులు కలిసి పోరాడితే ఎలా వుంటుందనే కల్పిత కథతో విజయేంద్ర ప్రసాద్ రాసిన కథను రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించారని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇప్పటికే సినిమాలోని నటీనటుల స్టిల్స్‌ను ఒక్కో సందర్భంలో విడుదలచేసి క్రేక్ తెచ్చారు. బాహుబలి నిర్మాతలు నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. ఇదిలా వుండగా దసరాకు మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడిస్తామని చిత్ర నిర్మాతలు తెలియజేస్తున్నారు.
