సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సిహెచ్
Last Modified: శనివారం, 2 అక్టోబరు 2021 (10:37 IST)

మహాత్మా గాంధీజీ చెప్పిన సక్సెస్ మంత్రాలు ఏమిటో?

మహాత్మా గాంధీజీ చెప్పిన సక్సెస్ మంత్రాలు ఏమిటో చూద్దాం. ప్రపంచానికి అహింసా మంత్రాన్ని అందించిన మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2. గాంధీజీ దేశానికి స్వేచ్ఛ సంపాదించడమే కాకుండా తన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకునేందుకు తన అనుభవాలను ఎన్నింటినో తెలిపారు. జీవితంలో సమస్యలు వచ్చిన వెంటనే భయపడే వారికి బాపు జీవితం ప్రత్యేక స్ఫూర్తిని ఇస్తుంది. గాంధీజీ జీవితం నుండి ఆ 4 లక్షణాలను ఇప్పుడు చూద్దాం.

 
మీ భవిష్యత్తు
ఈ రోజు మీ ఆలోచనపై ఆధారపడి ఉంటుంది మీ భవిష్యత్తు. ఈ రోజు మీరు ఏమనుకుంటున్నారో, ఏమి చేస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకే నిర్ణయం తీసుకోవడంలో తరచుగా తప్పులు చేస్తారు. వారు తమ రేపటి గురించి ఆలోచించరు. వారి సమయాన్ని, డబ్బును 'ఈరోజు' కోసం మాత్రమే ఖర్చు చేస్తారు. బాపు చెప్పేవారు, వర్తమానంలో నిర్ణయాలు సరిగ్గా ఉంటే, భవిష్యత్తు కూడా బాగుంటుంది.
 
 
జ్ఞానాన్ని పంచుకోవడంతోనే...
మీరు ఎంత ఎక్కువ జ్ఞానాన్ని పంచుకుంటారో, అంతగా మీరు పెరుగుతారని అంటారు. కాబట్టి అందరికీ సహాయం చేయండి. ఇది మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. జ్ఞానం పెరుగుతుంది.
 
 
సహనాన్ని కోల్పోవద్దు
గాంధీజీ యొక్క మూడవ మంత్రం ఏదైనా పని చేసేటప్పుడు సహనాన్ని వదులుకోవద్దనేది. ఏదైనా పనిలో విజయం సాధించడానికి, మీ మార్గంలో వచ్చే సమస్యలపై పోరాడుతూ ఉండాలి. విజయం కోసం ముందుకు సాగాలి. సహనం కోల్పేతే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరు.
 
 
ఆర్థిక క్రమశిక్షణ
మీ కోసం మీరు ఆర్థిక క్రమశిక్షణను పాటించడం ముఖ్యం. రేపటి కోసం ఆదా చేయండి. ఆ పొదుపులను సరైన చోట పెట్టుబడిగా పెట్టాలి.