గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (12:47 IST)

రాధే శ్యామ్ వ్యూస్ స్ట‌క్ అయ్యాయి కార‌ణం ఇదే!

Radhe syam twitter
ఈనెల 23న ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. ఇంకేముంది అంద‌రూ దానికి ఫిదా అయిపోయారు. ఓ ద‌శ‌లో ట్రాఫిక్ జామ్ అయిన‌ట్లు వ్యూస్ ఇంకా ముందుకు సాగ‌లేదు. తెలుగు సినిమా రంగంలో అత్య‌ధిక వ్యూస్ రికార్డ్ ఈ సినిమాకే వుంటుంద‌నుకుంటుండ‌గా ఇలా ష‌డెన్‌గా వ్యూస్ ఆగిపోవ‌డం వెనుక ఏదైనా కార‌ణ‌ముందా అని సినిమా టెక్నిక‌ల్ సెర్చ్ చేశారు. దాంతో య్యూబ్యూట్ ద‌గ్గ‌రే ఏదో జ‌రిగింద‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు. 
 
అభిమానులు తెగ గంద‌ర‌గోళానికి గుర‌య్యారు. దీనితో అభిమానులు అడిగిన ప్రశ్నకే యూట్యూబ్ టీం క్లారిటీ ఇచ్చింది. కొన్ని సార్లు యూట్యూబ్ వ్యూస్ కౌంట్ అప్డేట్ చెయ్యడం అనేది స్లో గా జరుగుతుంది అని అలాగే కొన్ని సందర్భాల్లో ఆలస్యం కూడా అవ్వొచ్చని తర్వాత అప్డేట్ చెయ్యడం జరుగుతుంది అని తెలిపారు. ముందు ముందు ఇలాంటి జ‌రిగితే ఏమి చేయాల‌నే ఇండికేష‌న్ కూడా ఈ టీమ్ తెలియ‌జేసింది.