బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 23 అక్టోబరు 2021 (15:43 IST)

విజ‌య‌వాడ‌లో డార్లింగ్ ప్ర‌భాస్ జ‌న్మ‌దిన వేడుక‌ల్లో బోండా ఉమా...

యువ‌త‌కు ఆరాధ్య‌దైవం... డార్లింగ్ ప్ర‌భాస్ పుట్టిన రోజు నేడు. ఆయ‌న అభిమానులు ప్ర‌భాస్ వేడుక‌ల‌ను ఎక్కువ‌గా వాట్స్ అప్, ఫేస్ బుక్, ట్విట‌ర్ లో జ‌రుపుకొంటుంటే, విజ‌య‌వాడ‌లో అభిమానులు ప్ర‌త్య‌క్షంగా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. 
 
స్టేట్ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడు డి. మురళి కృష్ణంరాజు ఆధ్వర్యంలో ప్రభాస్ జన్మదిన వేడుకలు విజ‌య‌వాడ‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర రావు హాజరయ్యారు.  అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి మహిళలకు చీరలు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. 
 
ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, ప్రభాస్ తన సినీ ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు జాతీయ స్థాయి హీరో అయి తెలుగువారు గర్వపడేలా చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో  నవనీతం సాంబశివరావు, సందీరెడ్డి గాయత్రి, పడమటి రామకృష్ణ, నున్న నాగేశ్వరరావు, మాల్యాద్రి, అనీల్ కుమార్, రాజేష్ వర్మ, మనీష్ తదితరులు పాల్గొన్నారు.