శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (11:06 IST)

మళ్లీ 10 వేలకు చేరువలో పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ 10 వేలకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 10,126 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న 332 మంది ప్రాణాలు కోల్పోయార‌ని తెలిపింది. 
 
ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా ఆసుప‌త్రులు, క్వారంటైన్ల‌లో 1,40,638 మందికి క‌రోనాకు చికిత్స అందుతోంది. కరోనా నుంచి నిన్న 11,982 మంది కోలుకున్నారు. అలాగే, కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,37,75,086కు చేరుకుంది. 
 
క‌రోనాతో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 4,61,389 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 59,08,440 డోసుల వ్యాక్సిన్ వేశారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 109,08,16,356 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. 
 
మరోవైపు, దేశ రాజధాని ఢిల్లీలో డెంగీ మరింత తీవ్రమవుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 9 మంది ప్రాణాలు కోల్పోగా తాజాగా మరో ముగ్గురు కన్నుమూశారు. 2017 తర్వాత ఈ మరణాలే అత్యధికం. మరోవైపు బాధితుల సంఖ్య 2,708కి పెరిగింది. 
 
గత వారం రోజుల్లోనే 1,170 కేసులు నమోదయ్యాయి. అక్టోబరు నెల మొత్తం మీద 1,196 డెంగీ కేసులు రాగా.. నవంబరులో 7 రోజుల్లోనే దాదాపు అన్ని కేసులు రావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. 
 
ఉత్తరప్రదేశ్‌లోని పారిశ్రామిక నగరం కాన్పూర్‌లో జికా బారినపడిన 89 మందిలో 17 మంది పిల్లలున్నారు. ఓ గర్భిణికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో ప్రత్యేక ఆరోగ్య బృందాలను నియమించారు. కాగా, దేశంలో ఆదివారం 11,451 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. 262 మంది చనిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో కేరళ మరణాలే 201 ఉన్నాయి.