1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Today Media Bulletin on Covid Positive Cases

దేశంలో మళ్లీ 11 వేలు క్రాస్ అయిన కరోనా పాజిటివ్ కేసులు

Covid Positive Cases
దేశంలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు 11 వేలు క్రాస్ అయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 11,451 కొత్త కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. 
 
తాజాగా 13,204 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అవగా.. మరో 266 మంది బాధితులు వైరస్‌ బారినపడి మృత్యువాతపడ్డారు. యాక్టివ్‌ కేసులు 262 రోజుల కష్టానికి చేరుకున్నాయని.. ప్రస్తుతం దేశంలో 1,42,826 యాక్టివ్‌ కేసులున్నాయని పేర్కొన్నది.
 
ఇదిలావుంటే, ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 0.42శాతంగా ఉన్నాయి. అలాగే, కరోనా వైరస్ బారినపడిన తర్వాత కోలుకునేవారి రేటు 98.24శాతానికి పెరిగిందని తెలిపింది. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,43,66,987కు పెరిగింది. ఇందులో 3,37,63,104 మంది బాధితులు కోలుకున్నారు. 4,61,057 మంది బాధితులు మహమ్మారి బారినపడి ప్రాణాలు వదిలారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
20వ రోజు వైయస్ షర్మిల ప్రజాప్రస్థానం