శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

తెలంగాణాలో రాగల 48 గంటల్లో భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాదాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అయితే, పలు ప్రాంతాల్లో మాత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ నుంచి అతిభారీ వర్షం కురుస్తుందని తెలిపింది. ముఖ్యంగా, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. 
 
ఇదిలావుంటే, శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడిన విషయం తెల్సిందే. అలాగే, హైదరాబాద్ నగరంలో కూడా వర్షపు జల్లులు కురిశాయి. జగద్గరిగుట్టలో మాత్రంలో అత్యధికంగా 4.5 మిల్లీమీటర్ల వర్షంపాతం నమోదైందనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.