Suhas: హే భగవాన్ నుంచి నా సినిమాలు అందర్ని అలరిస్తాయి.: సుహాస్
సుహాస్ హీరోగా 'లిటిల్‌హార్ట్స్ ఫేమ్ శివానీ నగరం నాయికగా నటిస్తున్న చిత్రం హే భగవాన్. సీనియర్ నటుడు నరేష్ కీలక పాత్రలో నటించగా యాంకర్ స్రవంతి చొక్కారపు ఓ ప్రముఖ పాత్రలో కనిపించనుంది. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం ఈచిత్రం టీజర్‌ను విడుదల చేయడంతో పాటు ఫిబ్రవరి 20న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు
హీరో సుహాస్ మాట్లాడుతూ ''టీజర్ లాంచ్ అనగానే నాకు మేసేజ్‌లు వచ్చాయి. ఈ సినిమాలో నాది గత సినిమాలతో పోలీస్తే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ పాత్రను చేశాను. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్ విత్ కంటెంట్. ఇక నుంచి నా సినిమాలు అందర్ని అలరిస్తాయి. ఈ సినిమాకు వంశీ నందిపాటి, బన్నీవాస్ యాడ్ అయిన తరువాత మా టీమ్‌కు మంచి బూస్ట్ వచ్చింది. నరేంద్ర రెడ్డి ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. ఈ సినిమా నా కెరీర్‌లో బెస్ట్‌ఫిలింగా నిలుస్తుంది. నాకు ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది' అన్నారు.
వంశీ నందిపాటి మాట్లాడుతూ '' ఆరు నెలల ముందు ఈ కథ విన్నాను. ఒక సంవత్సరంలో సినిమా రెడీ అవుతుంది అనుకున్నాను. కానీ అనుకున్న కొద్ది రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేసి బెటర్‌అవుట్‌పుట్‌తో వచ్చారు. ఈ సినిమాలో కొత్త సుహాస్‌ను చూడబోతున్నారు. శివానీకి ఈ సినిమా మూడో బ్లాక్‌బస్టర్. ఆమె పాత్ర కూడా సినిమాలో ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఎడిటర్ విప్లవ్ కంటెంట్ ప్రొటెక్షన్ కోసం ఓ మంచి యాప్‌ను రెడీ చేశాడు. అది అందరికి ఎంతో ఉపయోగపడుతుంది. ఓ మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నాం. హిట్ కొట్టబోతున్నామనే నమ్మకం ఉంది' అన్నారు.
శివానీ నగరం మాట్లాడుతూ '' వంశీ, బన్నీవాస్‌లు ఈ సినిమాను మరో బ్లాక్‌బస్టర్‌గా నిలుపబోతున్నారు. వాళ్లు చేస్తున్న ప్రతి సినిమా బ్లాక్‌బస్టరే. దర్శకుడు గోపీ గారు ఈ సినిమా విషయంలో చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో ప్రేక్షకులకు కావాలసినంత వినోదం ఉంది. సెట్ అంతా నవ్వుల మయంగానే ఉండేది. రేపు థియేటర్స్ కూడా నవ్వుల మయం కాబోతున్నాయి. సుహాస్‌తో మరో సినిమా చేయడం ఎంతో స్పెషల్‌గా ఉంది. ఫుల్ పవర్ ఫ్యాకడ్ ఎంటర్‌టైనర్ ఇది. ఫిబ్రవరి 20 ఈ సినిమా థియేటర్‌లో బ్లాస్ట్ కాబోతుంది' అన్నారు.
చిత్ర దర్శకుడు గోపీ అచ్చర మాట్లాడుతూ, సుహాస్ నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు. ఎంతో ఫ్రెండ్లీ పర్సన్. ఎంతో డేడికేషన్ ఉన్న నటుడు. శివానీ చాలా ఫ్రొఫెషనల్ ఆర్టిస్ట్. నటుడు సుదర్శన్ ఈ ప్రాజెక్ట్‌కు ఎంతో ప్లస్ అయ్యాడు. ఈ సినిమాతో యాంకర్ స్రవంతి నటిగా కూడా మంచి పేరు తెచ్చుకుంటుంది. వంశీ నందిపాటి గురించి, ఆయన పాషన్ కూడా అందరికి తెలుసు. సినిమా మీద ఎంతో ఎఫర్ట్ పెడతారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అన్నారు.