1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 నవంబరు 2021 (13:58 IST)

ఆ ఒక్కదానితో సరిపెట్టుకోవాలంటూ గోదావరి బోర్డుకు తెలంగాణ లేఖ

గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖ రాసింది. గత లేఖల ద్వారా తెలిసిన విధంగా ప్రాజెక్టులను బోర్డు అప్పగించే విషయంపై తమ ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, సంబంధిత అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉందని పేర్కొంది. 
 
ప్రభుత్వం నుంచి తనకు అమమతులు వచ్చేంత వరకు ప్రాజెక్టులను బోర్డు అప్పగించడం సాధ్యంకాదని స్పష్టంచేసింది. అంతేకాకుండా, బోర్డులో చర్చ అనంతరం అంగీకారం కుదిరిన ప్రాజెక్టులను మాత్రమే అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని తెలంగాణ ఇంజనీర్లు గోదావరి బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాశారు. పైగా, గోదావరిపైన పెద్దవాగు ప్రాజెక్టు మినహా ఏ ఒక్క ప్రాజెక్టు స్వాధీనం అవసరం లేదని పేర్కొంది. 
 
ఇటీవల గోదావరి బోర్డు ఉప సంఘం బోర్డు ఛైర్మన్ చంద్శేఖర్ అయ్యర్ నేతృత్వంలోని మంజీరా నదిపై ఉన్న సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులతో పాటు శ్రీరాంసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాలను కూడా సందర్శించారు. ఈ ప్రాజెక్టుల్లో వరదనీటి ప్రవాహాల సామర్థ్యం, విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలను బేరీజు వేశారు.