శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 6 నవంబరు 2021 (16:14 IST)

తిరుమ‌ల‌లో మూడు రోజులు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమ‌ల‌కు వ‌చ్చే వి.ఐ.పి. ల‌కు మూడు రోజుల పాటు ద‌ర్శ‌నాలు ర‌ద్ద‌య్యాయి. నవంబరు 13, 14, 15వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్న‌ట్లు టిటిడి పాల‌క వ‌ర్గం పేర్కొంది. నవంబ‌రు 12, 13 14వ తేదీల్లో సిఫార్సు లేఖలు స్వీకరించం అని తేల్చి చెప్పారు. 
 
 
తిరుప‌తి న‌గ‌రంలో నవంబరు 14న ద‌క్షిణాది రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌మావేశం ఉన్న నేప‌థ్యంలో నవంబరు 13, 14, 15వ తేదీల్లో తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను టిటిడి ర‌ద్దు చేసింది. ఆ రోజు తిరుప‌తికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు ద‌క్షిణాది రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు వ‌స్తున్నారు.  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అధ్యక్షతన తిరుపతిలో జరిగే సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశానికి వీరంతా హాజ‌ర‌వుతున్నారు.

 
ఈ కారణంగా నవంబ‌రు 12, 13 14వ తేదీల్లో విఐపి బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించం అని, భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది.