కుప్పం ఎన్నికల్లో అరాచకాలు: ఎస్ఈసీ కి చంద్రబాబు లేఖ
కుప్పం ఎన్నికల్లో అరాచకాలపై ఎస్ఈసీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పంలో ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వైసీపీకి చెందిన స్థానికేతరులు తిష్ట వేశారని ఆక్షేపించారు.
బోగస్ ఓట్లు, ఓటర్లను భయపెట్టేందుకు వైసీపీ ప్రణాళికలు రచిస్తోందని ఆరోపించారు. దొంగ ఓటర్లను అడ్డుకోవడంలో పోలీస్‌శాఖ తీవ్ర వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు.
ఎస్ఈసీ, డీజీపీలు వెంటనే చర్యలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. టీడీపీ నేతల ఫిర్యాదులను అధికారులు పట్టించుకోవడం లేదని తప్పుబట్టారు.
బయటి వ్యక్తుల ఫొటోలు, విజువల్స్ లేఖతో జత చేస్తున్నామని, ఎస్‌ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు లేఖలో విజ్ఞప్తి చేశారు.