పెట్రో, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం ఎడాపెడా పెంచేసి, ప్రజలకు వాతలు పెట్టి, ఈరోజు రూ. 5-10 తగ్గించి, ఆయింట్ మెంటు పూసినంత మాత్రాన బీజేపీని ప్రజలు కనికరిస్తానుకోవడం వారి పిచ్చి భ్రమే అవుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) స్పష్టం చేశారు. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడగొట్టి, అదే పెట్రోలు, డీజిల్ మంటల్లో ప్రజలు తగులబెట్టారని, ఆంధ్రప్రదేశ్ లోనూ తిరుపతి, బద్వేలు ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని గల్లీ బీజేపీ సిల్లీ రాజకీయాలు చేస్తుందంటూ మండిపడ్డారు.
రాష్ట్రంలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుతిరిగే వృద్ధ జంబూకం చంద్రబాబు కూడా, బీజేపీకి తోక పార్టీగా తయారై, పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని ప్రైవేటు వ్యక్తులు నడిపే పెట్రోలు బంకుల దగ్గర నిరసన చేయాలని పిలుపు ఇవ్వడం సిగ్గు చేటు అని ధ్వజమెత్తారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు పెట్రోలు ధరలను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తగ్గిస్తారా లేక ప్రధాని తగ్గిస్తారా అన్న విషయం తెలిసి కూడా తెలియనట్టుగా మాట్లాడుతున్నాడంటూ దుయ్యబట్టారు.
పెట్రో ధరల పెంపుపై చంద్రబాబు నిరసనలు చేయాల్సింది రాష్ట్రంలోని పెట్రోలు బంకులు దగ్గర కాదని, గతంలో డ్రామాలు చేసినట్టుగా, నల్ల చొక్కా వేసుకుని ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీ ముందు ధర్నా చేయాలని హితవు పలికారు.
రాష్ట్రంలో రోడ్లు వేస్తానని, మరమ్మత్తులు చేస్తానని గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు బ్యాంకులనుంచి అప్పులు తెచ్చి, రోడ్లు వేయకపోగా, ఆ అప్పు తీర్చకపోకపోవడం వల్లే.. ఇప్పుడు పెట్రో, డీజిల్ పై రూపాయి సెస్ విధించడం జరుగుతుందని చెప్పారు. అలానే అమరావతి రాజధాని అభివృద్ధి పేరుతో నాలుగున్నరేళ్ళపాటు లీటర్ కు రూ. 2 లు చొప్పున సర్ ఛార్జి వేసి, దాదాపు రూ. 10 వేల కోట్లు ప్రజల నుంచి లూటీ చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. కుప్పంలో జరగబోయే స్థానిక ఎన్నికల్లోనూ చంద్రబాబును ఓడించి, టీడీపీని రాజకీయ సమాధి చేయాలని పిలుపునిచ్చారు.
మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..
1- పెట్రోల్, డీజీల్ ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకునే మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా దేశ ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇక ఏపీలో బద్వేల్ ఉప ఎన్నిక తీసుకుంటే... బీజేపీ పోటీ చేస్తే.. జనసేన మద్దతు ఇస్తే, టీడీపీ ఏజెంట్లను కూర్చోబెట్టి... మూడు పార్టీలు కలిసి వైయస్సార్ సీపీ మీద పోటీ చేసినా... వారికి డిపాజిట్లు కూడా రాకుండా వైయస్సార్ సీపీని 90వేల పైచిలుకు మెజార్టీతో ప్రజలు గెలిపించారు.
- పశ్చిమ బెంగాల్‌లో నాలుగు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఆ నాలుగు నియోజకవర్గాల్లో లక్షకుపైగా మెజార్టీతో తృణమూల్ కాంగ్రెస్ ను గెలిపించి బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించారు. దేశంలో అధికారంలో ఉన్నచోట, లేనిచోట బీజేపీ చిత్తు చిత్తుగా ఓడిపోతే, రాబోయే ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీని ప్రజలు పెట్రోల్, డీజిల్ పోసి తగలబెడతారని కేంద్ర నాయకత్వం అర్థం చేసుకుని ఒక అయిదు రూపాయిలు పెట్రోల్ మీద, పది రూపాయిలు డీజిల్ మీద తగ్గించింది. మేమేదో ఘనకార్యం చేశాం.. ధరలు తగ్గించి దేశ ప్రజలను ఆదుకున్నామన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
2- లీటర్ రూ.70 ఉన్న పెట్రోల్ ధరను రూ.118 పెంచి ... చివరకు రూ.5 తగ్గించి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. ప్రజలకు వాతలు పెట్టి ఆయింట్‌మెంట్ రాస్తే ... ప్రజలు కనికరిస్తారనే పిచ్చి భ్రమలో బీజేపీ నాయకులు బతుకుతున్నారు. రాష్ట్రంలో సోము వీర్రాజుతో పాటు బీజేపీ నాయకులు రోడ్లమీదకు వచ్చి.. రూ.40 పెంచేసి.. మోదీగారు 10 రూపాయిలు తగ్గించారు, మీరెంత తగ్గిస్తారు జగన్ మోహన్ రెడ్డిగారు అంటూ ప్రశ్నిస్తున్నారు.
- జగన్‌గారు అధికారంలోకి వచ్చాక డీజిల్ మీద వేసిన ట్యాక్స్ కేవలం ఒక రూపాయి. అది కూడా చంద్రబాబు నాయుడు రోడ్లు వేస్తామంటూ బ్యాంకుల నుంచి రూ.3,800 కోట్లు అప్పు తీసుకు వచ్చి రోడ్లు వేయకుండా.. వాటిని పసుపు-కుంకుమ కింద పంచిపెట్టారు. డీజిల్, పెట్రోల్ మీద రూ.2 సెస్ వేసి, ఏటా చెల్లించాల్సిన ప్రీమియంలు చెల్లించకుండా, దుర్మార్గుడు చంద్రబాబు చేసిన అగ్రిమెంట్ వల్ల వారికి కట్టాల్సిన బకాయిల కోసం పెట్రోల్, డీజిల్ మీద రూ.1 సెస్ వేస్తే.. మీరేమి తగ్గిస్తారంటూ పనికిమాలిన బీజేపీ, టీడీపీ నాయకులు అడుగుతున్నారు.
- జగన్ పెంచిన రూపాయిలో 7పైసలా, 8పైసలా, 11పైసలా? ఎంత తగ్గించాలి?. అదే మీరు పెట్రోల్, డీజిల్‌పై పెంచిన రూ.50 లో రూ.5, ఏడున్నర రూపాయిలు తగ్గిస్తే, మరి మేము తగ్గించాల్సింది ఏడు పైసలా? ఎనిమిది పైసలా?
- ఉప ఎన్నికల్లో బీజేపీని ప్రజలు పెట్రోల్, డీజిల్ పోసి తగలబెట్టినా సిగ్గు, శరం లేదు. నరేంద్రమోదీగారు దేశ ప్రధాని అయిన సమయంలో అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధర రూ.100-105 ఉంది. ఇవాళ అంతకన్నా తక్కువ ఉంది. అయినా కూడా పెట్రోల్, డీజిల్ ధరలను వంద దాటించిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానికే దక్కింది.
3- రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ట్యాక్స్‌లు ఎగవేసేందుకు ఎక్సైజ్ డ్యూటీని కేవలం రూ.47వేల కోట్లు మాత్రమే చూపిస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.19వేల కోట్లు మాత్రమే పంచిపెడుతున్నారు. అది కాకుండా సర్ చార్జీ రూపంలో రూ.74వేల కోట్లు, మౌలిక వసతులు, రోడ్డు నిర్మాణాల కోసం ట్యాక్స్ అంటూ రూ.లక్షా 98వేల కోట్లు, పెట్రో ఉత్పత్పుల మీద పన్ను అంటూ రూ.15వేల కోట్లు... ఇవన్నీ దాదాపు ఏడాదికి ప్రజల నుంచి రూ.3లక్షల 50వేల కోట్లు దోచుకుంటున్న జలగలు కేంద్రంలోని బీజేపీవారే.
- ఓవైపు రూ.3లక్షల 50వేల కోట్లు దోచుకుంటూ, మరోవైపు రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయానికి గండి కొట్టి, మేమేదో దేశాన్ని, ప్రజల్ని ఉద్దరించామంటూ ఇంధన ధరలు తగ్గించేశాం... అన్ని రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేయాలనే దిక్కుమాలిన పరిస్థితిలో కేంద్ర బీజేపీ పని చేస్తోంది.
4- తిరుపతి ఉప ఎన్నికలో జనసేనను కలుపుకుని పోటీ చేసినా డిపాజిట్ రాని బీజేపీ, బద్వేల్ ఉప ఎన్నికలో మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా డిపాజిట్ రాని సిల్లీ, గల్లీ బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. బీజేపీ చేసిన పాపాలను జగన్ మోహన్ రెడ్డిగారి మీద రుద్దే ప్రయత్నం చేస్తోంది. వీటన్నింటిని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు గమనించడం లేదనుకోవడం మీ అమాయకత్వం. తిరుపతి, బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా రాని స్థితిలో ఉంది. దానిపై ఆ పార్టీ ఒక్కసారి అయినా ఆత్మ పరిశీలన చేసిందా?
5- దేశాన్ని ఏలే బీజేపీ ప్రభుత్వం, ప్రపంచంలో అతి పెద్ద పార్టీ అని, అత్యధిక ఎంపీలు ఉన్న పార్టీ అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ.. ఆంధ్రప్రదేశ్‌లో గెలుపు ఓటములను పక్కన పెడితే.. పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకూ కనీసం డిపాజిట్లు రావడం లేదంటే మీరు చేసే అరాచకాలు, కులాలు, మతాలు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రయత్నాలు చేయడం, ప్రజల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రిపై అభాండాలు వేయాలని చూస్తున్నారు కాబట్టే.. ఎన్నికల్లో ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. రాష్ట్ర బీజేపీని ఇక దేవుడు కూడా కాపాడగలిగే శక్తి, సామర్థ్యాలు లేవని చెప్పగలం.
6- ఇక బీజేపీకి తోక పార్టీ, 40 ఇయర్స్ ఇండస్ట్రీ, పెట్రోల్, డీజిల్ కనిపెట్టింది నేనే అని చెప్పుకునే వృద్ధ జంబూకం.. పెట్రోల్ బంక్‌ల దగ్గర నిరసన దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో ఏ నిరసన దీక్ష చేయాలన్నా బంద్ చేయాలన్నా ప్రభుత్వ కార్యాలయాలు, లేదా బస్టాండ్, రైల్వేస్టేషన్‌లు, రోడ్ల మీద చేయడమే ఇప్పటివరకు చూశాం. తాజాగా చంద్రబాబు .. ఆ పార్టీ కార్యకర్తలతో పెట్రోల్ బంక్‌ల వద్ద నిరసన దీక్షలు చేస్తారట. ప్రైవేట్ ప్రాపర్టీలు అయిన పెట్రోల్ బంక్‌లు దగ్గర నిరసన దీక్షలు చేసి, వాటిపై దాడులు జరిగితే.. రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం అయ్యాయని చెప్పడానికి మాత్రమే ఈ ప్రయత్నం.
7- చంద్రబాబుకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. ఆయన జీవితం అంతా అసత్యాలు, మోసాలు, కుట్రలు, వెన్నుపోట్లు. చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అయ్యాక అమరావతిని అభివృద్ధి చేయడానికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలని, లిటరుపై రూ.2 సర్ ఛార్జ్ వేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు.
రాష్ట్రంలో రెండు రూపాయిలు సర్ ఛార్జ్ వేసి నాలుగున్నరేళ్లు అమలు చేసి, దాని ద్వారా రాష్ట్ర ప్రజల నుంచి రూ.10వేల కోట్లు లూటీ చేసిన దుర్మార్గుడు చంద్రబాబు. 20019 ఎన్నికలు జరిగే మూడు నెలల ముందు ప్రజలు మాడు పగులగొడతారనే భయంతో రూ.2 సర్ ఛార్జ్ తగ్గించాడు బాబు. ఇవాళ పెట్రో ధరలు పెంచి బీజేపీ ఎలా తగ్గించిందో అలాగే చంద్రబాబు ఎన్నికల ముందే ఈ పని చేశాడు.
ఎంతైనా మోదీకి అయిదేళ్లు సీనియర్ అయిన చంద్రబాబు... మోసం, వెన్నుపోటులోనూ సీనియరే. దొంగ నాటకాలు, డ్రామాలు వేసే మోసకారి కాబట్టే, చంద్రబాబును, ఆయన పార్టీని 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు పెట్రోల్, డీజిల్ పోసి తగలబెట్టారు. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో అయినా అదే రీతిలో తగలబెడుతున్నా.. ఇంకా బుద్ధి రావడం లేదు.
8- మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రిపై బురద చల్లేందుకు ఏదోవిధంగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదీ దొరక్క పోవడంతో పెట్రోల్ బంక్‌ల వద్ద ధరలు తగ్గించాలంటూ ధర్నాలు చేయడం సిగ్గుచేటు. డిజీల్, పెట్రోల్ ధరలు తగ్గించాల్సింది కేంద్ర ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కాదు కదా? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబుకు ఆ మాత్రం తెలియదా? లేక తెలిసీ తెలయనట్టు నటిస్తున్నాడా..?
- జగన్ మోహన్ రెడ్డిగారికి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని విషయాలపై ధర్నాలు, నిరసనలా?. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో కూడా రాష్ట్ర ప్రజలు మళ్లీ నిన్ను పెట్రోల్, డీజిల్ పోసి తగలబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. చేతగాని రాజకీయాలు చేస్తూ, కేంద్రాన్ని ప్రశ్నించకుండా కేసులకు భయపడి దొంగలా తిరుగుతూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు.
ఎన్ని నీచ కార్యక్రమాలు, అబద్ధాలు చెప్పినా నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. ఈ ప్రభుత్వం వసూలు చేసే ప్రతి రూపాయిని రాష్ట్రంలోని నిరు పేదల అభ్యున్నతికి, రాష్ట్ర అభివృద్ధి కోసమే వెచ్చించడం జరుగుతోంది. అందుకే రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా 70,80శాతం ప్రజానీకం ఆశీస్సులు అందిస్తున్నారు.
9- చంద్రబాబు లాంటి సిగ్గులేని నాయకులు కావచ్చు, ఆయన పార్ట్‌నర్ పవన్ కల్యాణ్ కావొచ్చు, బీజేపీలోని గల్లీ నాయకులు కావొచ్చు.. ఎంతమంది ఎన్ని అవాకులు, చెవాకులు పేలినా జగన్ గారి మీద ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఆయన స్థాయిని ఎంత దిగజార్చాలని చూసినా... ప్రజలు మాత్రం రోజు రోజుకూ జగన్ గారిని ఒక మెట్టు పైకి ఎక్కిస్తూనే ఉన్నారు. జగన్‌గారిని, ఆయన పాలనను చూసి, మాట మీద నిలబడేతత్వాన్ని చూసి, ఆయన చేసిన పోరాటాలను ఆదర్శంగా తీసుకుని పనిచేసినట్లు అయితే బీజేపీ కనీసం రాష్ట్రంలో ప్రతిపక్షంగా అయినా ఉంటుంది.
అలా కాకుండా కేంద్రంలోని మీ పార్టీ చేసే తప్పులను జగన్‌గారి మీద రుద్దాలని ప్రయత్నిస్తే, రాష్ట్రంలో జరిగే మంచి కార్యక్రమాలను కేంద్రం డబ్బులుతో చేస్తున్నారని చెప్పాలనుకుంటే... ప్రజలు మీకు గడ్డి పెట్టి, డిపాజిట్లు లేకుండా, మీ పార్టీకి నోటా కన్నాతక్కువ ఓట్లు వచ్చే స్థాయికి దిగజార్చుకోవద్దని, నోటికి ఏదివస్తే అది మాట్లాడవద్దని హెచ్చరిస్తున్నాం.
10- మీరు భయపడితే భయపడటానికి ఇక్కన మేకలో, నక్కలో లేవు. జగన్ మోహన్ రెడ్డిగారు పులివెందుల పులి. అధికారంలో ఉన్న సోనియాగాంధీ లాంటివారినే లెక్కచేయకుండా, సొంతంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, 16 నెలలు జైల్లో పెట్టినా, వెనక్కి తగ్గకుండా ముందుకు అడుగులు వేశారు. ఉడత ఊపులకు, తాటాకు బెదిరింపులకు బెదిరే వ్యక్తులు ఎవరూ ఇక్కడ లేరు. జగన్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది.
- కేంద్రం చేసిన తప్పులకు, పెంచే చార్జీల వల్ల మేము నష్టపోతున్నామని రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్రానికి చెప్పుకుంటే మంచిది. తప్పుడు విధానాలతో నడిచే బీజేపీ, టీడీపీలను రాష్ట్ర ప్రజలు పెట్రోల్, డీజిల్ పోసి తగలబెట్టారు. మీరు ఎంత రేటు తగ్గించినా మీరు చేసే మోసాలు ప్రజలకు తెలుసు. రేపు జరగబోయే ఎన్నికల్లోనూ మళ్లీ ప్రజానీకం పెట్రో, డీజిల్ ల్లో తగలబెట్టి మసి చేస్తారు. ఇప్పటికైనా పిచ్చి మాటలు మాట్లాడవద్దని చెబుతున్నాం.
11- పీకే- పవన్ కల్యాణ్... మొన్న విశాఖ వెళ్లి ఏదోదో మాట్లాడాడు. ఆయన చేసే ప్రసంగం విని వేదిక మీద ఉన్నవాళ్లే ఆశ్చర్యపోయారు. జగన్ మోహన్ రెడ్డిగారికి డెడ్‌లైన్ అట... ఆయన పెట్టే డెడ్‌లైన్ ఏంటంటే వారంలో అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాలట. దానికి జగన్‌గారు వరకూ ఎందుకు. మీ పార్టీలలో ఒకరిని చొప్పున పంపిస్తే నేనే ఫ్లైట్ టికెట్లు పెట్టుకుని ఢిల్లీ తీసుకు వెళతా? విశాఖ స్టీల్‌ఫ్లాంట్ ప్రైవేటీకరణను ఆపాల్సింది కేంద్రంలో ఉన్న బీజేపీనే.
బీజేపీ అలయెన్స్‌లో సిగ్గుశరం లేకుండా మీరే పోటీ చేస్తారు. వారిని మాత్రం అడగలేరు. అల్టిమేటం ఇవ్వాల్సింది బీజేపీకి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తే మీతో కలిసి పోటీ చేయను అని మోదీగారికి అల్టిమేటం ఇవ్వాలి కదా? ఇవ్వాల్సింది మోదీగారికి వార్నింగ్? మీ పార్ట్‌నర్ చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధాని, అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.
- మోదీ, అమిత్‌షాను కలిసేందుకు పవన్ కల్యాణ్ రెండు, మూడుసార్లు ఢిల్లీ వెళ్లి వచ్చాడు.. అక్కడ ఉన్న సెకెండ్ గ్రేడ్ నాయకులతో మాట్లాడుకోమని పంపించివేశారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు కలిసి రెండున్నరేళ్లుగా కేంద్ర పెద్దల అపాయింట్‌మెంట్ కోసం ట్రై చేస్తున్నా ఫలితం లేకపోవడంతో.. వారిని కలిసేందుకు ఇప్పుడు మీకు జగన్ మోహన్ రెడ్డిగారు కావాల్సి వచ్చిందా.
- విశాఖ స్టీల్‌ప్లాంట్ అంశాన్ని అడ్డం పెట్టుకుని అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లమంటే అందులో పవన్, చంద్రబాబు దూరిపోయి... రెండు నిమిషాలు పర్సనల్‌గా మాట్లాడాలంటూ, వారి రెండుకాళ్లు పట్టుకుని వేళ్లాడతారు. ఏదో అడుక్కుని, రాజకీయాలు మాట్లాడుకుని అలయన్స్ పెట్టుకుని రాష్ట్రాంలో మీ ముగ్గురు కలిసి పోటీచేయాలనా... మీకు సిగ్గుందా? వీళ్లకు ఎటూ అపాయింట్‌మెంట్లు దొరకవు కాబట్టే.. అఖిలపక్షాన్ని అడ్డుపెట్టుకుని జగన్‌గారు ఢిల్లీ తీసుకువెళ్లాలని అడుగుతున్నారు.
- జనం, మేమే పిచ్చివాళ్లుగా కనిపిస్తున్నామా? మీకు మోదీగారి అపాయింట్‌మెంట్ కావాలంటే మీరు చేసిన మోసాలు, పాపాలు ఒప్పుకుంటూ ఆయన ఇంటి ముందు మోకాళ్ల మీద నిలబడితే అపాయింట్‌మెంట్ ఇస్తారేమో? అంతేకానీ మీ రాజకీయ అవసరాలు కోసం, మీ సొంత పనుల కోసం కేంద్ర అధిష్టానం దగ్గరకు జగన్‌గారు తీసుకువెళ్లే ప్రసక్తే లేదు. వారం కాదు, ఏడు ఏళ్లు టైమ్ ఇచ్చినా తీసుకువెళ్లేది లేదు.
12- రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఏం చేయాలో జగన్ మోహన్ రెడ్డిగారికి తెలుసు. ఒడిశా పర్యటనకు వెళ్లిన ఆయన సాగునీటి ప్రాజెక్ట్‌లతో పాటు సరిహద్దు గ్రామాల సమస్య మీద ఒడిశా సీఎంతో చర్చించనున్నారు. అదే చంద్రబాబు ఏనాడు అయినా ప్రజల కోసం పని చేశారా? చంద్రబాబుకు రాజకీయ అవసరం ఉంటే సోనియాగాంధీ కాళ్లు పట్టుకునేందుకు వెళ్లిపోతాడు, రాహుల్ గాంధీ, మోదీగారి కాళ్ళు పట్టుకుంటాడు. ఎవరితో అవసరం ఉంటే.. వారితో, దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ కార్యాలయం గుమ్మం ఎక్కింది చంద్రబాబే.
- జగన్ గారు సీఎం అవగానే తెలంగాణకు మనకు ఉన్న సమస్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో రెండుసార్లు భేటీ అయి చర్చించారు. అలాగే ఒడిశాతో ఉన్న రాష్ట్ర సమస్యల చర్చించేందుకు నవీన్ పట్నాయక్‌తో భేటీ అరు. రాష్ట్రం కోసం మారుమూల ఉన్న చిన్న చిన్న గ్రామాల కోసం, వారిని రాష్ట్రంలో కలుపుకుని, వారిని కూడా మన పౌరులుగా కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న 21 గ్రామాల గురించి స్వయంగా ముఖ్యమంత్రి .. ఒడిశా వెళ్లి చర్చలు జరుపుతున్నారంటే ఆయన నిబద్ధతను అర్థం చేసుకోవచ్చు.
- 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏనాడు అయినా ఈ ఆలోచన చేశారా? ఎందుకు ఈ సమస్యను పరిష్కరించలేకపోయాడు. కేంద్రంలో నేనే చక్రం తిప్పానని సొల్లు కబుర్లు చెప్పే బాబు, ఒక గ్రామం గురించి అయినా ఆలోచించాడా? సిగ్గుతో తలవంచుకోవాలి. లక్షల కోట్లు దోచుకున్న దుర్మార్గుడైన చంద్రబాబు చేసే నిరసనలు, దొంగ మాటలను ప్రజలు గమనించి, కుప్పంలో జరిగే ఎన్నికలలో కూడా ఘోరంగా ఓడించి, చంద్రబాబును శాశ్వతంగా రాజకీయ సమాధి చేయాలి.