సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (21:46 IST)

స్నేహితుడి భార్యపై అత్యాచారం.. వీడియో తీసి బెదిరింపులు.. చివరికి..?

ప్రేమిస్తున్నానని నమ్మించి పలు మార్లు స్నేహితుడి భార్యపై అత్యాచారం చేశాడు ఓ దుండగుడు. దారుణానికి పాల్పడుతూనే వాటికి సంబంధించిన వీడియోలను ఫోన్‌లో రికార్డ్‌ చేశాడని బాధితురాలు పోలీసుల ముందు వాపోయింది. జరిగిన విషయాన్ని బయటికి చెబితే పిల్లల్ని, భర్తను చంపేస్తానని బెదిరించాడు. 
 
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్, గాజుల రామారంలోని నెహ్రు నగర్‌కు చెందిన ప్రశాంత్‌.. తన స్నేహితుడి ఇంటికి తరచూ వెళ్తుండేవాడు. జీడిమెట్ల భాగ్యలక్ష్మీ కాలనీలో ప్రశాంత్‌ స్నేహితుడు తన భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. 
 
తరచూగా ప్రశాంత్‌ తన స్నేహితుడి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలోనే స్నేహితుడి భార్యపై కన్నేసిన ప్రశాంత్‌.. ప్రేమిస్తున్నానని, అంగీకరించాలని లేదంటే చచ్చిపోతానంటూ వేధింపులకు గురి చేశాడు. ప్రేమిస్తున్నానని నమ్మించి పలు మార్లు స్నేహితుడి భార్యపై అత్యాచారం చేశాడు
 
ఆ తర్వాత డబ్బులు ఇవ్వాలని లేదంటే వీడియోలు బయటపెడతానంటూ బెదిరింపులకు గురి చేశాడు. వీడియోలు వైరల్‌ చేస్తానంటూ బెదిరించి ఇప్పటి వరకు రూ.16 లక్షల వసూలు చేశాడు. చివరకు ప్రశాంత్‌ వేధింపులు తట్టుకోలేక బాధితురాలను పోలీసుస్టేషన్‌కు వెళ్లింది. జరిగిన దారుణాన్ని పోలీసులకు వివరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.