గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (17:36 IST)

తమన్నాను ఆ షో కోసం ఒప్పించే ప్రయత్నం చేశారా?

తెలుగు ఎంటర్‌‌టైన్‌మెంట్‌ ఛానెల్ జెమిని టీవీ రేటింగ్ విషయంలో చాలా వెనుక పడింది. తెలుగులో ఈ రెండు షోలు ఖచ్చితంగా మంచి హిట్ అయ్యి జెమిని టీవీని మంచి స్థాయికి తీసుకు వెళ్తాయి అనుకుంటే నిరాశ మిగిల్చాయి. ఏమాత్రం రేటింగ్‌ను పెంచకపోగా నష్టాలను మిగిల్చింది. 
 
ముఖ్యంగా తమన్నా హోస్ట్‌గా చేసిన మాస్టర్ చెఫ్‌తో జెమిని టీవీకి పరువు పోయినంత పనైంది. ఒకటి రెండు టీఆర్పీ రావడంతో ఏం చేయాలో పాలుపోక తమన్నాను తప్పించారు. అది కాస్త మరింత వివాదంగా మారి జెమిని టీవీ వారికి చిక్కులు తెచ్చి పెట్టింది.
 
జెమిని టీవీ వారు చెప్ప పెట్టకుండా తమన్నాను తీసేసి మాస్టర్‌ చెఫ్‌‌కు హోస్ట్‌‌గా జబర్దస్త్‌ ముద్దుగుమ్మ అనసూయను తీసుకువచ్చారు. దాంతో తమన్నాకు కోసం వచ్చింది. తనను మధ్యలో ఎలా తొలగిస్తారు అంటూ ప్రశ్నించింది. తనకు రావాల్సిన పారితోషికం చెల్లించాల్సిందే అంటూ కోర్టును కూడా ఆశ్రయించింది. మొత్తానికి ఈ వివాదం చాలా పెద్ద ఇష్యూగా మారుతుంది అనుకుంటున్న సమయంలో సైలెంట్‌ అయ్యింది.
 
అనూహ్యంగా ఎందుకు సైలెంట్ అయ్యిందా అనుకుంటూ ఉండగా ఇండస్ట్రీ వర్గాల వారు ఈ విషయాన్ని రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేశారట. సన్ నెట్‌ వర్క్ వారితో మాట్లాడి ఈ విషయంలో ఒక స్పష్టమైన రాజీని కుదిర్చారు అంటున్నారు. తమన్నాకు వచ్చిన నష్టాన్ని భర్తీ చేయడంతో పాటు జెమిని టీవీ వారి విషయంలో కూడా కాస్త న్యాయం చేసినట్లుగా చెప్తున్నారు. మొత్తానికి తమన్నా, జెమిని టీవీ వారి మద్య ఉన్న గొడవలు పూర్తిగా తొలగి పోయినట్లే అంటున్నారు.