మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 6 సెప్టెంబరు 2021 (16:25 IST)

వీరమల్లు త‌ర్వాతే ప‌వ‌న్‌తో మైత్రీమూవీస్ చిత్రం

Mytri movie producers with pavan
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్, ప్రముఖ యువ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం విదితమే. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. దీనికి సంబంధించిన తాజా సమాచారం ఇది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు శరవేగంగా పూర్తి కానున్నాయి.'భీమ్లా నాయక్' చిత్రం త్వరలో పూర్తి కానుంది. 'హరి హర వీరమల్లు' చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభమైన తదుపరి తమ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే చిత్రం షూటింగ్ మొదలవుతుంది అని, మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ లు తెలిపారు. 
 
పవన్ కళ్యాణ్ పుట్టినరోజున విడుదల అయిన ఈ చిత్రం ప్రచారచిత్రం అభిమానుల అంచనాలను, ఉత్సుకతను మరింత పెంచిన నేపథ్యంలో,చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతోందన్న తాజా సమాచారం మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అయాంక బోస్ ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తున్నారు. కళా దర్శకుడు గా ఆనంద సాయి, ఎడిటర్ గా చోటా కె ప్రసాద్, పోరాటాలు రామ్ లక్ష్మణ్ ఇప్పటివరకు ఎంపిక అయిన ప్రధాన సాంకేతిక నిపుణులు.